శ్యాం ప్రసాద్ ముఖర్జీకి బీజేపీ నివాళులు…

నవతెలంగాణ-బెజ్జంకి
మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం చౌరస్తా వద్ద శ్యాం ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి దినోత్సవాన్ని బీజేపీ నాయకులు అదివారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి బీజేపీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి,మండలాధ్యక్షుడు రాజు,అనీల్,మల్లేశం,రాములు,యువమోర్చా మండలాధ్యక్షుడు తూముల రమేష్,రామచంద్రం, శంకర్ హాజరయ్యారు.