– శాలువ కప్పి ఘన సన్మానం..
నవతెలంగాణ-బెజ్జంకి
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారును మంగళవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎంపీ కార్యలయంలో మండల బీజేపీ శ్రేణులు మర్యాద పూర్వకంగా కలిసినట్టు బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి బుధవారం తెలిపారు.కేంద్ర మంత్రిని మండలాధ్యక్షుడు కొలిపాక రాజు, రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ, జిల్లా కౌన్సిల్ మెంబర్ బుర్ర మల్లేశం గౌడ్, మండల నాయకులు కొత్తపేట రామచంద్రం,రాచకొండ శ్రీదర్ రావు వడ్లూర్ శ్రీనివాస్, గండ్ల శ్రీను,సాన వేణు, ఒగ్గు కనకయ్య,దేవనబోయిన జగన్, వివిధ గ్రామాల బూత్ అధ్యక్షుడు గంగుల ఎల్లం, గాజే రవి,కాడే నాగరాజు, బూర సాయి,దేవనబోయిన రాజు శాలువ కప్పి సన్మానించిట్టు మహిపాల్ రెడ్డి తెలిపారు.
మండలాధ్యక్షుడికి కేంద్ర మంత్రి సన్మానం..
రెండవ దఫా నూతన బీజేపీ మండలాధ్యక్షుడిగా ఎన్నికైన కొలిపాక రాజును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శాలువ కప్పి సన్నానించారు. ప్రజల అకాంక్షలకనుగుణంగా బీజేపీ శ్రేణులు పని చేస్తూ మరింత పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచినట్టు కొలిపాక రాజు తెలిపారు.