– కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆరోపణ
– మిజోరంలో హీటెక్కిన రాజకీయం
ఐజ్వాల్ : మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్), జోరామ్ పీపుల్స్ మూవ్ మెంట్ (జడ్‌పీఎం) వంటి ప్రాంతీయ సంస్థలు బీజేపీకి ”అనధికారిక ఏజెంట్లు” గా వ్యవహరిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించారు. ”రాజీవ్ గాంధీ 1986లో శాంతి ఒప్పందం ద్వారా మిజోరంలో శాంతిని తీసుకు వచ్చారు. 1987లో రాష్ట్ర హోదాను సాధించారు. కాంగ్రెస్ ఎల్లప్పుడూ ఆ రాష్ట్ర పురోగతికి కట్టుబడి ఉంది. బీజేపీ -ఆర్‌ఎస్‌ఎస్ భిన్నత్వానికి వ్యతిరేకం. ఆదివాసీల ఆస్తిగా ఉన్న అడవిని లాక్కోవాలనుకుంటున్నారని ఖర్గే ఆరోపిం చారు. గిరిజనులు తమ సన్నిహితుల సంక్షేమం కోసం, బీజేపీకి అనధికారిక ఏజెంట్లుగా సంకీర్ణ సర్కార్‌లోని పార్టీలు వ్యవహరిస్తున్నాయి” అని ఖర్గే పోస్ట్ చేశారు.మిజోరం ప్రజలు శాంతి, శ్రేయస్సు , పురోగతికి అర్హులని, మిజోరం సంక్షేమం, సమ్మిళిత ఆర్థిక భద్రతకు కాంగ్రెస్ హామీ ఇస్తుందని ఖర్గే అన్నారు.
మేము ఏమి వాగ్దానం చేస్తామో, దాన్ని అందిస్తాం అని హామీ ఇచ్చారు. ఈశాన్య రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావాలని చూస్తున్న కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మిజోరం కొత్త శాసనసభ మొదటి సెషన్‌లో కొత్త బిల్లును ఆమోదిస్తుందని హామీ ఇచ్చింది. భూమి, అడవులు రాష్ట్ర గిరిజన ప్రజల హక్కులుగా స్పష్టం చేసింది.కాంగ్రెస్ ఆరోపణలతో మిజోరంలో రాజకీయం హీటెక్కింది.