– మతోన్మాద పార్టీని గద్దె దించేందుకు అందరూ ఏకం కండి : మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-తుంగతుర్తి
బీజేపీ పాలన దేశానికి అత్యంత ప్రమాదకరమని, ఆ పార్టీని గద్దె దించేందుకు అందరూ ఏకం కావాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో శనివారం సీపీఐ(ఎం) నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంపదను పెట్టుబడిదారులకు దోచి పెట్టారని, మతవిద్వేషాలు రగిల్చి ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.