నియంతృత్వం దిశగా బీజేపీ పాలన

– ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎపి షా
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య వ్యవస్థలను ఉపయోగించుకుని బీజేపీ నియంతృత్వం దిశగా పయనిస్తోందని ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎపి షా విమర్శించారు. న్యాయస్థానాలను, మీడియాను నిర్వీర్యం చేయడం, భిన్నాభిప్రాయాలను అణిచివేయడం ఆ ధోరణికి నిదర్శనం అని అన్నారు. మైనారిటీలు భయంతో జీవిస్తుంటే… కోర్టులు చూస్తూ ఉన్నాయని అన్నారు. మనుస్మృతికి మద్దతుగా వాదించే న్యాయమూర్తులు మెజారిటీ భాష మాట్లాడుతున్నారని అన్నారు. బిజెపిని ‘ఎన్నికైన నియంతృత్వం’గా అభివర్ణించిన ఆయన, విడి సావర్కర్‌ కాలం చెల్లిన హిందుత్వ ఆశయాలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.