
నవతెలంగాణ – కోహెడ
బీజేపీ అవలంభిస్తున్న నిరంకుశ పాలనకు పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలు చరమగీతం పాడాలని రాజ్యాంగ పరిరక్షణ కమిటీ జెఏసీ హుస్నాబాద్ నియోజకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని రక్షించేందుకు ప్రజలు పోరాటం చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. గత పది సంవత్సరాలుగా మోదీ రాచరిక పాలనను కొనసాగిస్తున్నారన్నారు. కేంద్రంలో బిజేపీ గెలిస్తే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మారుస్తానంటూ కేంద్ర మంత్రులు, సీఎంలు అనడం దారుణమన్నారు. దేశంలో ఉన్న 88 శాతం దళిత బహుజనులను అయోమయానికి గురిచేస్తున్న మోదీ పాలన అంతమెందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జెఏసీ హుస్నాబాద్ నియోజకవర్గ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, దళిత బహుజన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.