– ఎమ్మెల్లే వీర్లపల్లి శంకర్, ఎంపీ అభ్యర్థి చల్లా వంశీ చంద్‌రెడ్డి
– కాంగ్రెస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం
నవతెలంగాణ-కొందుర్గు
మతం పేరుతో ఓట్లడుగుతున్న బీజేపీని ఓడించాలని షాద్‌నగర్ నియోజకవర్గం ఎమ్మెల్లే వీర్లపల్లి శంకర్ అన్నారు. కొందుర్గు, జిల్లెడ్ చౌదరి గూడా కాంగ్రెస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమా వేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షాద్‌నగర్ నియోజకవర్గం ఎమ్మెల్లే వీర్లపల్లి శంకర్, ఎంపీ అభ్యర్థి చల్లా వంశీ చంద్‌రెడ్డి హాజర య్యారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉన్న ఎంపీలు తెలంగాణ రాష్ట్రాన్ని విస్మరించారన్నారున. కేంద్రం నుంచి నిధులు, ఉన్న ప్రాజెక్టులకు జాతీయ హౌదా తీసుకురాలేదన్నారు. కనీసం ఒక్కసారి కూడా రోడ్డు, ప్రాజెక్టుల అభివృద్ధికి కానీ ఏనాడు మాట్లాడని మన్నే శ్రీనివాస్ రెడ్డి, మళ్ళీ ఏమి ముఖం పెట్టుకుని ఓట్లడుగుతాడని ప్రశ్నిం చారు. ఎంపీ అభ్యర్థి చల్లా వంశీ చంద్ రెడ్డి మాట్లాడుతూ బీజేపి పార్టీకి ఓటేస్తే రాజ్యాంగాన్ని తొలగిస్తామని ప్రగాల్బాలు పలుకుతున్నారనీ, అలాంటివారికి ఓటేస్తే సెక్కులారిజం నశింపజే స్తారన్నారు. మైనారిటీలకు, క్రిస్టియన్లకు ప్రమా దమనీ, ఎస్సీలను మతం పేరుతో వేదిస్తున్నారనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మతం పేరుతో ఓట్లడు గుతున్న బీజేపీని ఓడించాలన్నారు. గత ఎన్నికల్లో రెండు కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామనీ, పదేండ్లు గడించినా ఎన్ని కోట్లమందికి ఉద్యోగాలిచ్చారో తెలియజేయాలని నిలదీశారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు దొందూ దొందేనని దుయ్యబట్టారు. ప్రజలందరూ ఏకమై, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే, లక్ష్మి దేవిపల్లి ప్రాజెక్టు నిర్మిస్తామని హామీనిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్లే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి, కాంగ్రెస్ కొందుర్గు అధ్యక్షులు కృష్ణారెడ్డి, సలెంద్రంపల్లి రాజు, ఎస్సీ, సెల్ అధ్యక్షులు నరేందర్, యాదయ్య, పురుషోత్తం రెడ్డి, జితేందర్ రెడ్డి, పర్వతపూర్ మల్లేష్ గౌడ్, వజ్రమ్మ, శ్రీనివాస్ రెడ్డి రెండు మండలాల కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌లో చేరిన ఉత్తరాస్పల్లి వాసులు
కొందుర్గు మండల కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల విస్తృతస్తాయి సమావేశంలో ఉత్తరాస్పల్లి ఎంపీటీసీ అంజిరెడ్డి ఆధ్వర్యంలో ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్లే వీర్లపల్లి శంకర్ సమక్షంలో ఇతర పార్టీలు, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు 35 మంది ఉత్తరాస్పల్లి గ్రామం నుంచి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరినవారికి కాంగ్రెస్ కండువా కప్పి, పార్టీలోకి ఎంపీ అభ్యర్థి చల్లవంశీచంద్ రెడ్డి ఆహ్వానించారు.