బీజేపీ కార్యకర్తలు సైనికుల్లా పని చేయలి.. 

నవతెలంగాణ- తాడ్వాయి 
బీజేపీ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని కర్ణాటక రాష్ట్రం దవనగిరే జిల్లా హరిహార్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే హరీష్ పిలుపునిచ్చారు. తాడ్వాయి మండలం ఎర్ర పహాడ్ గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే ప్రవాస్ యోజన వర్క్షాప్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరాలని కోరారు. పార్టీలో కార్యకర్తలు ఎలాంటి అంతర్గత భేదాలు లేకుండా బీజేపీ విజయం కోసం పని చేయాలన్నారు. ప్రతి బీజేపీ నాయకుడు కార్యకర్తలా అంకితభావంతో పనిచేస్తూ విజయానికి తోడ్పాటును అందించాలని సూచించారు. ఎల్లారెడ్డిలో ఈసారి కచ్చితంగా బీజేపీదే విజయమన్నారు  అందుకోసం బూతు స్థాయిలో పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రి రామ్ రెడ్డి, పైల కృష్ణారెడ్డి, నాయకులు బాపురెడ్డి, లింగారావు, తాడ్వాయి మండల బీజేపీ అధ్యక్షులు వెంకట్రావు, నాయకులు రవీందర్ రావు, సంతోష్ రెడ్డి, తిరుపతిరెడ్డి, మైపాల్ యాదవ్, సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు