కిషన్ రెడ్డి దీక్ష బగ్నాన్ని నిరసిస్తూ బిజెపి రాస్తారోకో

నవతెలంగాణ-గోవిందరావుపేట
రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి 24 గంటల దీక్షను పోలీసులు భగ్నం చేయడాన్ని నిరసిస్తూ గురువారం మండల కేంద్రంలో 163 వ జాతీయ రహదారిపై బిజెపి మండల అధ్యక్షులు మద్దినేని తేజ రాజు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా తేజ రాజు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ  పిలుపుమేరకు మండల కేంద్రంలో  రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు 24 గంటల దీక్ష చేస్తున్న సమయంలో తెలంగాణ పోలీసులు అక్రమ అరెస్టులు చేయడం జరిగిందనీ, అందుకాను  గోవిందరావుపేట మండల కేంద్రంలో  నిరసన కార్యక్రమముచేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్  ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బిజెపి పార్టీ కార్యకర్తలు, మండల పదాధికారులు, పార్టీ శ్రేణులు మీడియా మిత్రుల ద్వారా  హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకులు ఏనుగు రవీందర్ రెడ్డి ,కర్ర సాంబశివారెడ్డి ,రుద్రారం సురేష్, మెరుగు సత్యనారాయణ చౌగాని స్వప్న, చందజ్యోతి ,అంత్ రెడ్డి రమాదేవి, అజ్మీర్ ఆ లలిత, వలపదాసు రవిశంకర్, బైరి మహిపాల్ రెడ్డి, ఏదునూరి రమేష్, అజ్మీరా వినోద్ బూరుగుల చంద్ర మొగిలి, శ్యామల శ్రీనివాస్, మూల కుమార్ గడ్డం చక్రపాణి, వేములపల్లి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు