దేశాన్ని విచ్ఛిన్నం చేయడమే బీజేపీ లక్ష్యం

BJP's aim is to break the country– దేశ సమగ్రత మాతోనే సాధ్యం
– మోడీ, అమిత్‌షా ఆటలు సాగనివ్వం : పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
– భారత్‌ జోడో యాత్రకు ఏడాది పూర్తి
– సోమాజిగూడ నుంచి నెక్లెస్‌రోడ్‌ వరకు భారీ ప్రదర్శన
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
మతం, కులం పేరుతో దేశాన్ని విచ్ఛినం చేయడమే బీజేపీ పంతంగా కనిపిస్తున్నదని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి విమర్శించారు. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్దిపొందేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేక్‌ ఇన్‌ ఇండియా అన్న ప్రధాని మోడీ…ఇండియా పేరునే మార్చేస్తున్నారని విమర్శించారు. దేశ సమైక్యత, సమగ్రతే కాంగ్రెస్‌ లక్ష్యమన్నారు. రాజ్యాంగాన్ని, లౌకికతత్వాన్ని కాపాడేందుకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ‘భారత్‌ జోడో యాత్ర ‘ చేపట్టారని గుర్తు చేశారు. యాత్రకు గురువారంతో ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ పాదయాత్రలు చేపట్టింది. హైదరాబాద్‌లోని సోమాజిగూడ నుంచి నెక్లెస్‌రోడ్‌లోని ఇందిరమ్మ విగ్రహం దాకా భారీ ర్యాలీ నిర్వహించారు. భారత్‌ జోడో అంటూ నినదించారు. బీజేపీ, మోడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పెద్ద పెద్ద జెండాలతో ర్యాలీ ఉత్సాహంగా సాగింది. అనంతరం నిర్వహించిన సభలో రేవంత్‌ మాట్లా డుతూ 2014లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక దేశ ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడిందన్నారు. దేశంలో దళితులకు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యో గాలు ఇస్తానన్న మోడీ మాట తప్పారని ఆరోపిం చారు. నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆపలేని పరిస్థితి నెలకొందన్నారు. ‘ఇండియా కూటమి’కి భయపడే దేశం పేరు మారుస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీకి చేతనైతే ఇండియా కూటమిని ఎదు ర్కోవాలని సవాల్‌ విసిరారు. పెరుగుతున్న ధరలు, మణిపూర్‌ పరిణామాలపై మోడీ పార్లమెంటులో చర్చించడంలేదని విమర్శించారు. కేవలం కాంగ్రెస్‌ ను తిట్టడానికే ఆయన ఎక్కువ సమయం కేటాయి స్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ ఏం చేసిందన్న మోడీకి…గుజరాత్‌లో మోడీ తిరుగుతున్న ఎయిర్‌ పోర్ట్‌ కాంగ్రెస్‌ నిర్మించిందేనని గుర్తు చేశారు. నిజాం నవాబుల నుంచి తెలంగాణకు విముక్తి కలిగించింద న్నారు. తెలంగాణకు స్వాతంత్య్రం కల్పించింది కాంగ్రెస్‌ కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అధ్యక్షు లు వల్లభభారు పటేల్‌ కాదా? పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, భారతదేశం అభివృద్ధిని లెక్క కడదామా? అని ప్రశ్నించారు. ‘విభజించు- పాలించు’ అనే విధానం తో దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర బీజేపీ చేస్తున్నదని విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ పొలిమేరల దాకా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కారు ఢిల్లీకి వెళ్లి కమలంగా మారుతోందని ఎద్దేవా చేశారు. లక్ష కోట్లు దోచిన కేసీఆర్‌కు మద్దతు తెలప డంలో ఎంఐఎం ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించినం దుకా కాంగ్రెస్‌ను ఓడించాలంటున్నారని అసదుద్దీన్‌ ను నిలదీశారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుట్ర చేసి కాంగ్రెస్‌ సభను జరగకుండా చేస్తున్నాయని విమర్శించారు. 17న నిర్వహించబోయే సభకు ఉప్పెనలా తరలివచ్చి హైదరాబాద్‌ నగరాన్ని కప్పేయాలని పిలుపునిచ్చా రు. సీడబ్ల్యుసీ సమావేశాల భద్రత కోసం పోలీసుల ను అడిగితే స్పందించడం లేదన్నారు. మోడీ, కేసీఆర్‌ అధికారం అడ్డంపెట్టుకుని అధికారులను భయపెడు తున్నారని విమర్శించారు. ర్యాలీలో ఏఐసీసీ ఇంచార్జి మాణిక్‌ రావు ఠాక్రే, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్ర మార్క, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, అంజన్‌కుమార్‌ యాదవ్‌, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్‌ చౌదరీ, మన్సూర్‌ అలీ ఖాన్‌, అధికార ప్రతినిధి కృష్ణతేజ, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షులు సునీతారావు, కార్పొరేటర్‌ విజయారెడ్డి, నగర నాయకులు రోహిన్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఫిరోజ్‌ఖాన్‌, నగేష్‌ ముది రాజ్‌, బొల్లు కిషన్‌, కోట నీలిమా తదితరులు పాల్గొన్నారు.