రాజ్యాంగ సంస్థల ధ్వంసమే బీజేపీ లక్ష్యం

రాజ్యాంగ సంస్థల ధ్వంసమే బీజేపీ లక్ష్యం– కేసీఆర్‌ పాలనలో పెరిగిన నిరుద్యోగం: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
నవతెలంగాణ- ఖమ్మం
మోడీ పాలన నేరాలోచనతో సాగుతున్నదని, ప్రత్యర్థులను ఇబ్బందు లు పెట్టడం, రాజ్యాంగ సంస్థలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా పరిపాలి స్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ ఆరోపించారు. శుక్రవారం ఖమ్మంలోని గిరిప్రసాద్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించడమే లక్ష్యంగా సీపీఐ పనిచేస్తోందన్నారు. ఇండియా కూటమిలో భాగస్వాములు గా ఉన్నామని, ఆ క్రమంలోనే ఒక్క స్థానానికే పరిమితమై కాంగ్రెస్‌తో ఎన్నికల ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. ఒక్క ఓటుతో తెలంగాణ ప్రజలు మూడు పార్టీలకు బుద్ధి చెప్పా లని పిలుపు నిచ్చారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం లోపాయకారి ఒప్పం దాలతో పనిచేస్తున్నాయని, అందుకే ఎంఐఎం రాజాసింగ్‌పై పోటీ పెట్ట లేదని తెలిపారు. ఒకప్పుడు సీఎం బీజేపీకి వ్యతిరేకంగా పనిచేశారని, ఆ క్రమంలోనే మునుగోడులో మద్దతు ఇచ్చామని, కానీ కూతురు లిక్కర్‌ కేసులో ఉన్న తరువాత కేసీఆర్‌ వైఖరి మారిపోయిందన్నారు. అటవీ సంరక్షణ చట్టాన్ని మార్చి ఆదివాసీల ను బయటకు పంపే ప్రయత్నం జరుగుతున్నదని, తద్వారా అటవీ సంపద కార్పొరేట్ల పరమౌతుంద న్నారు. చంద్రబాబు అరెస్టు, బెయిల్‌ వెనుక బీజేపీ హస్తం ఉందని ఆరోపించారు. తమతో కలిసి రానం దుకు జైలుకు పంపారని, తెలంగాణ లో టీడీపీ పోటీ చేయకపోవడంతో బెయిల్‌ ఇచ్చారని తెలిపారు. కాళేశ్వరం కూలిపోవడం, పేపర్‌లీక్‌లు, 50 శాతం కమీషన్లు కేసీఆర్‌ను పుట్టి ముంచనున్నాయన్నారు. తెలంగాణ ప్రజలు అవినీతినైనా సహిస్తారు కాని అహంకారాన్ని సహించరని, ఎమ్మెల్యే లకు ప్రవేశం లేని అసెంబ్లీ ఎందుకని ప్రశ్నించారు. కేసీఆర్‌ కేబినెట్‌లో తెలంగాణ ద్రోహులే ఎక్కువగా ఉన్నారని అన్నారు. ఖమ్మం నియోజక వర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి సీపీఐ మద్దతు ఇవ్వడం లేదనే అపవాదు సరికాదన్నారు. సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వరరావు కుమారుడైనంత మాత్రాన ఖమ్మంలో బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తారనుకోవడం సరికాద న్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్‌, సహాయ కార్యదర్శి దండి సురేష్‌, కార్యవర్గ సభ్యులు జమ్ముల జితేందర్‌రెడ్డి, ఎస్‌కె.జానిమియా పాల్గొన్నారు.