– రాజ్యాంగ రక్షణ కోసం ఐక్యంగా ఉద్యమించాలి
– డీహెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం కల్పించిన హక్కులను తీసివేయడానికి కుట్రలు చేస్తుందని, మతోన్మాద బీజేపీని ఓడిచేందుకు ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని మారుపాక అనిల్ కుమార్ అన్నారు. మంగళవారం సీపీఐ కార్యాలయం కుత్బుల్లాపూర్‌లో జిల్లా స్థాయి సమా వేశం డీహెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షలు గాలం లక్ష్మనా రాయణ అధ్యక్షతన జరిగింది. డీహెచ్‌పీఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కే ఏసురత్నం, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఉమా మహేష్ హాజరైనారు. ముఖ్యఅ తిథిగా డీహెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారు పాక అనిల్ కుమార్ హాజరై మాట్లాడారు. కేంద్ర బీజేపీ సర్కార్ అధికారంలోకి వచ్చి మతాన్ని దేవుడిని అధికార యంత్రాంగంలోకి, రాజకీయాల్లోకి ప్రవేశిం పజేసి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతు న్నదని విమర్శిం చారు ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, రైల్వే లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేస్తున్నారని అన్నారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలను మార్చాలని కేంద్రం ప్రయత్నం చేస్తున్నదని తెలిపారు. దేశ స్వాతంత్రం కోసం కుల మతాలకు అతీతంగా ప్రజల ంతా ఉద్యమం చేశారానే విషయం కేంద్ర ప్రభుత్వం గుర్తించడం లేదన్నారు. అన్ని మతాల ప్రజలు గ్రామాల్లో సోదరా భావంతో ఉంటారని.. వారి మధ్యల మత విద్వేషాలు పెట్టి ప్రజలను చీలుస్తు న్నారన్నారు. దేశ సంపదను ఆధాని, అంబానిలకు దోచి పెడుతున్నారని, నిరుద్యోగులను మోసం చేశారని అన్నారు. అలాగే జమిలీ ఎన్నికలు నిర్వహిం చేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పా రు. మహిళలపై లైంగికదాడి చేసిన వారికి అండగా బీజేపీ ప్రభుత్వాలు ఉంటున్నాయని విమర్శించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలో బీజేపీని గద్దించడమే దేశభక్తుల కర్తవ్యం అని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డీహెచ్‌పీఎస్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి కె సహదేవ్, సహాయ కార్యదర్శి చిలుముల మల్లేష్, ఉపాధ్యక్షులు చర్లపల్లి రాములు, దర్శనం యాదగిరి, నర్సింగ్ రావు, నియోజకవర్గ అధ్యక్షులు కత్తుల దుర్గ య్య ప్రజానాట్యమండలి మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ఏ ప్రవీణ్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, హరినాథ్ రావు, అంబాల ఎల్లయ్య, డీహెచ్‌పీఎస్ దుండిగల్ మండల నాయకులు డప్పు రామస్వామి, వెంకటేష్, అధ్యక్షులు ఇందారం ఎల్లయ్య, సత్యవతి, కమల తదితరులు పాల్గొన్నారు.