నవతెలంగాణ మోపాల్
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సాయి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల తెలంగాణ ప్రజలపై బీజేపీ ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని కేవలం తమ మిత్రపక్షమైన ఆంధ్రప్రదేశ్, బీహార్ కు మాత్రమే పెద్ద పీట వేసిందని, అసలే తెలంగాణ లోటు బడ్జెట్ తో ఉంటే ఈ బడ్జెట్ ఊరట కలిగిస్తుందని తెలంగాణ ప్రజలు ఎదురు చూసారని కానీ చివరకు నిరాశే మిగిలిందని, ఇప్పటికైనా బీజేపీ ఎంపీలు మాటలకే పరిమితమయ్యారే తప్ప చేతల విషయంలో రాష్ట్రానికి తెచ్చింది శూన్యమని రాష్ట్రానికి సంబంధించిన ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న కూడా రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పునర్ఆలోచించి తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల నెరవేర్చాలనీ. అలాగే తెలంగాణ ప్రజలపై సవతి తల్లి ప్రేమ చూపించకుండా తెలంగాణకు న్యాయం చేయాలని వారు కోరారు.