నవతెలంగాణ- చండూరు : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 27 సంవత్సరాల తర్వాత గెలిచిన సందర్భంగా చండూరు మండల కేంద్రంలో బీజేపీ మండల, మున్సిపల్ అధ్యక్షులు ముదిగొండ ఆంజనేయులు, పందుల సత్యం గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా బాణసంచా కాల్చి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. తదనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ అవినీతిలో కూరుకుపోయిన అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఢిల్లీ ప్రజలు తగిన చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కోమటి వీరేశం, జిల్లా కౌన్సిల్ సభ్యులు నకిరేకంటి లింగస్వామి, ఎస్సి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నేపర్తి యాదగిరి, జిల్లా నాయకులు బోడ ఆంజనేయులు, రావిరాల శ్రీను,తడకమల్ల శ్రీధర్, ఇరిగి ఆంజనేయులు, సోమ శంకర్, మండల ఉపాధ్యక్షులు జెట్టి యాదయ్య, నలపరాజు యాదగిరి,సీనియర్ నాయకులు చెనగాని శేఖర్, భూతరాజు స్వామి, మన్నెం ప్రవీణ్, పులిజాల రవీందర్, యువ మోర్చా పట్టణ అధ్యక్షులు దోటి శివ యాదవ్, యువ మోర్చా జిల్లా నాయకులు వేముల పవన్, బూత్ అధ్యక్షులు నలపరాజు సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.