తెలంగాణ యూనివర్సిటీ కి నూతనంగా నియమితులైన వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు కు మంగళవారం బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పానుగంటి సతీష్ రెడ్డి మంగళవారం మార్యద పూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ కు తెలంగాణ యూనివర్సిటీలో నెలకొని ఉన్న సమస్యలు వివరించారు. అన్ని సమస్యలను త్వరలో పరిష్కరిస్తానని సానుకూలంగా హామీ ఇచ్చినట్లు పానుగంటి సతీష్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో వినోద్ రెడ్డి నాయకులు పాల్గొన్నారు.