భారతీయ జనతా యువ మోర్చా యాదాద్రి భువనగిరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగుల సమస్యలపై రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జిల్లా కలెక్టరేట్ ముట్టడి నిర్వహించినట్లు తెలిపారు. పోలీసులు జిల్లా వ్యాప్తంగా ముందస్తు అరెస్టులు ఎన్నో చేసిన పోలీసులు వ్యూహాలను ఎదుర్కొని 2 వర్గాలుగా వీడిపై 2 సార్లు కలెక్టర్ లోకి దూసుకెల్లడానికి ప్రయత్నించాగా, వారిని అదుపులోకి తీసుకొని తుర్కపల్లి మండలం పోలీస్ స్టేషన్ కు బొమ్మలరామారం మండల పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా బీజేవైఎం నాయకులు మాట్లాడుతూ గ్రూప్-1 మెయిన్స్ కీ 1:50 కాకుండా 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలి.గతంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ మేరకు గ్రూప్-2 లో 783పోస్ట్ లను 2000 కి పెంచాలని, గ్రూప్-3 1365 పోస్ట్ లను 3000లకు పెంచాలి. డీఎస్సీ, గ్రూప్- పరీక్షల మద్య ఒక వారం కూడా వ్యవధి లేక నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు, ఆ మీ వ్యవధిని పెంచాలి. గ్రూప్-2 మరియు 3 సిలబస్ కామన్ ఉన్నందున, నవంబర్ లో జరగనున్న గ్రూప్-3 అనంతరం గ్రూప్-2 పరీక్షను డిసెంబర్ కీ వాయిదా వేయాలి.ఉపాధ్యాయుల ప్రమోషన్ దృష్ట్యా భారీగా ఏర్పడ్డ ఖాళీలను పరిగణలోకి తీసుకుని ఈ తాజా డీఎస్సీ నోటిఫికేషన్ లో అదనపు ఖాళీలు కలిపి మెగా డీఎస్సీ నిర్వహించాలి, టెట్ పరీక్ష అయిపోయి కనీసం నెల రోజులు గడవక ముందే డీఎస్సీ పెట్టడం వలన నూతనంగా క్వాలిఫై అయినా టెట్ అభ్యర్థులకు డీఎస్సీ రాయడంలో ఇబ్బందులు ఉన్నాయి కావున 2 నెలలు పోస్టోపొన్ చేయాలి. ఉద్యోగ నియామక అనంతరం బ్యాక్ లాగ్ ఖాళీలు ఏర్పడకుండా 2వ లిస్ట్ ప్రకటించి నియామకాలు జరపాలి.అన్ని నియామకాల్లో మహిళా అభ్యర్థులకు 33% రిజర్వేషన్ కేటాయించాలి. పోలీసు కానిస్టేబుల్ నియామకాల్లో అభ్యర్థులకు అన్యాయం చేస్తున్న జీవో నెంబర్ 46ను వెంటనే రద్దు చేయాలి. జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ , బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శిలు దిండు భాస్కర్ గౌడ్ ,బురుగు మని గౌడ్, దయ్యాలు కుమార్ స్వామి, బీజేవైఎం నాయకులు ముక్కుర్ల గణేష్, భువనగిరి సదానందం గౌడ్, సైదులు, నగేష్, మంగు నర్సింహ్మ రావు, ఎలిజల శ్రీను, బట్టు క్రాంతి,భుంగమట్ల మహేష్, ప్రవీణ్ ,పబ్బు వంశీ,వినోద్, శ్రీకాంత్, రంజిత్ రెడ్డి,కొలిచెలిమి మల్లికార్జున్, రత్నపురం ప్రవీణ్, కందరి శ్రీధర్, సిద్ధులు రత్నపురం బలరాం, సురేష్ రెడ్డిలు పాల్గొన్నారు.