ఉదయం లేవగానే గొంతులో కాఫీ పడనిదే బెడ్ కూడా దిగరు చాలా మంది. ఎక్కువ మంది టీ కంటే కాఫీనే ఇష్ట పడతారు. సరైన మోతాదులో తాగితే కాఫీతో ఎన్నో రకాల ఉపయోగాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజూ కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని పలు అధ్యయనాలు చెబు తున్నాయి.
బ్లాక్ కాఫీలో ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి ఒత్తిడి, ఆందోళన వంటివి దరి చేరకుండా ఉంటాయి. ఒత్తిడిగా అనిపించినప్పుడు, టెన్షన్‌గా ఉన్నప్పుడు ఒక కప్పు బ్లాక్ కాఫీని తీసుకుంటే చాలా మంచిది. కాఫీ తాగితే కేంద్ర నాడీ వ్యవస్థ యాక్టీవ్ అవు తుంది. దీంతో రీఫ్రెష్‌గా ఉంటుంది.
బ్లాక్ కాఫీ.. లివర్ ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో హెల్ప్ చేస్తుంది. ఫ్యాటీ లివర్, హైపటైటిస్, కాలేయ క్యాన్సర్, ఆల్కహాలిక్ సిర్రోసిస్ ప్రమాదాన్ని కూడా నివారిస్తుంది. బ్లాక్ కాఫీ తాగడం వల్ల పొట్ట ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. చక్కెర లేని కాఫీ శరీరంలో ఉండే టాక్సిన్స్, బ్యాక్టీరియాను సులభంగా బయటకు పంపిస్తుంది.