
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం చలకుర్త గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తురక చిన్న సోములు అనారోగ్యం తో ఆదివారం మృతి చెందారు. వారి పార్థివ దేహానికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మల పల్లి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ సర్పంచ్ తుమ్మల పల్లి లలిత వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీటిసి గోదాల నారాయణ రెడ్డి,మాజీ ఉపసర్పంచ్ పిల్లి శంకర్, కాంగ్రెస్ కార్యకర్తలు కుటుంబ సభ్యులను పరామర్శించి పూలమాల వేసి నివాళులు
అర్పించారు. నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పగడాల నాగరాజు,సల్లా హన్మంతరెడ్డి గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు నివాళులు అర్పించిన వారిలో పాల్గొన్నారు.