– ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు
– నెల్లికుదురు ఎస్సై చిర్ర రమేష్ బాబు
నవతెలంగాణ – నెల్లికుదురు
నల్ల బెల్లం పట్టికను ఎంతటి వారైనా ఆక్రమ వ్యాపారం చేస్తే సహించేది లేదని నెల్లికుదురు ఎస్సై చిర్రా రమేష్ బాబు, హెచ్చరించినట్టు తెలిపారు. మండలంలోని సంధ్య తండ గ్రామపంచాయతీ పరిధిలోని ధర్మ తండాలో 14 బస్తాల నల్ల బెల్లం ఒక బస్తా పట్టుకను పట్టుకునే కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలోని వివిధ గ్రామాలలో తండాలలో ఎక్కడ కూడా ఆక్రమ వ్యాపారం చేస్తే ఎవరినైనా సహించేది లేదని తెలిపారు. నిబంధన అతిక్రమిస్తే ఎంతటి వారి పైన చర్యలు తీసుకుంటామని అన్నారు. మండలంలోని సంధ్య తండా పరిధిలోని ధర్మ తండ లొ సోదాలు నిర్వహించగా దారం సోత్ కృష్ణ, బానోతు వెంకటేష్ ల వద్ద 14 బస్తాల నల్ల బెల్లం ఒక బస్తా పట్టికను పట్టుకొని సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు నెల్లికుదురు ఎస్సై చిర్ర రమేష్ బాబు తెలిపారు. 14 బస్తాల నల్ల బెల్లం ఒక బస్తా పట్టిక రూ.72000 వేలు విలువ ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ రవీందర్ కానిస్టేబుల్ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.