– నల్ల మట్టి పేరిట అక్రమ దందా
– అధిక లోడ్ టిప్పర్లతో గ్రామస్తుల భయం
– పట్టించుకోని సంబంధిత అధికారులు
నవతెలంగాణ – భీంగల్
చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్న చందంగా ఉంది నల్ల మట్టి దళారులు తీరు. వ్యవసాయ రంగం పేరు చెప్పి రైతుల పంట చేలకు అవసరమయ్యే నల్ల మట్టిని చెరువుల నుండి తీస్తూ అక్రమంగా అమ్ముకుంటున్నారు. ఇదంతా సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో తమకు అడ్డు అదుపు లేదంటూ ప్రతినిత్యం పదుల సంఖ్యలో చెరువు మట్టిని భారీ టిప్పర్లతో వేల్పూర్, కమ్మర్పల్లి, మోర్తాడ్ మండలాలకు తరలిస్తున్నారు. భీంగల్ మండలంలోని ముచ్కూర్ గ్రామంలోని రెండు చెరువుల నుండి నల్ల మట్టిని తీస్తూ ఒక్కో టిప్పర్ కు 15 నుండి 20 వేల వరకు వసూలు చేస్తూ అక్రమ వ్యాపారం కొనసాగిస్తున్నారు. ప్రతినిత్యం గ్రామం నుండి అధిక లోడుతో భారీ టిప్పర్లు వెళ్లడంతో రోడ్లన్నీ ధ్వంసం అవ్వడంతో పాటు దుమ్ము, ధూళి ఇళ్లలోకి వచ్చి చేరుతుందని గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పైగా ప్రస్తుతం ఒంటిపూట బడులు కొనసాగడం వల్ల చిన్నపిల్లలు రోడ్లపై ఆడుకోవడంతో ఈ భారీ టిప్పర్లతో ఇప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. లక్షలు వెచ్చించి వేయించిన రోడ్లన్నీ ధ్వంసం అవుతున్నాయి. అధిక లోడుతో వస్తున్న టిప్పర్ల పక్కనుండి వెళ్లే వాహనదారులపై మట్టి పిల్లల పడి గాయాల పాలవుతున్నారు. భీంగల్ పట్టణ కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో రద్దీగా ఉండే జనాల మధ్య నుంచి ఈ భారీ టిప్పర్ లు వెళ్తున్నాయి.ఒకరిద్దరూ వ్యాపారులు తమ స్వలాభం కోసం గ్రామ వనరుని ఇతర ప్రాంతాలకు అమ్ముకొని జేబులో నింపుకుంటున్నారని గ్రామానికి చెందిన కొందరు యువకులు చెబుతున్నారు.

నిబంధనలు తుంగలో తొక్కి..
వ్యవసాయ రంగానికి అవసరమయ్యే నల్ల మట్టిని ఇతర ప్రాంతాలకు కాకుండా అదే ప్రాంత రైతులు ఒక మీటరు లోతుమేరా మట్టిని తీసుకొనాల్సి ఉండగా ఇలాంటి నిబంధనలు తమకేవి పట్టనట్లు కొందరు దళారులు చెరువులలో మట్టిని ఆ ప్రాంత రైతులకు కాకుండా ఇతర ప్రాంత రైతులకు అమ్మి జేబులు నింపుకుంటున్నారు. పైగా ఐదు ఆరు మీటర్ల లోతు మట్టిని తీయడంతో పెద్ద పెద్ద గొయ్యిలు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు ఏర్పడిన గొయ్యిలే వర్షాకాలం నీటితో నిండి మృత్య కూపాలుగా మారుతున్నాయి.
ప్రతి సంవత్సరం తెగుతున్న చెరువులు..
ముచ్కూర్ గ్రామంలోని నల్ల చెరువు ప్రతి సంవత్సరం కురుస్తున్న వర్షాలకు కట్ట తెగిపోయి పంటపొదలాలు దెబ్బతింటున్నాయి. ప్రతి వేసవికాలం ఈ చెరువులో నల్ల మట్టిని లోతుగా తీయడంతో నీటి సామర్థ్యం ఎక్కువగా అయ్యి కట్ట తెగిపోతుందని ఆ ప్రాంత రైతులు, గ్రామస్తులు ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చినను నల్ల మట్టిని ఆపలేకపోతున్నారు.
సంబంధిత అధికారుల జాడేది..
చెరువులను కాపాడే ఇరిగేషన్, రెవెన్యూ . రోడ్లను కాపాడే ఆర్ అండ్ బి , అధిక లోడ్లను నియంత్రించే ఆర్టిఏ అధికారులు ఒక్కసారి కూడా కన్నెత్తి చూడడం లేదు. దీంతో తమ దందాను యదేచ్చగా కొనసాగిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా దృష్టి సారించి చెరువులను కాపాడి ఆ గ్రామ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరుతున్నారు.