– ప్రైమ్ వాలీబాల్ లీగ్
చెన్నై: ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ ఐదో ఓటమి మూటగట్టుకుంది. చెన్నైలో శనివారం జరిగిన మ్యాచ్‌లో కాలికట్ హీరోస్ చేతిలో 13-15, 16-18, 14-16తో పరాజయం పాలైంది. మూడు సెట్ల హోరాహోరీ మ్యాచ్‌లో బ్లాక్‌హాక్స్ గట్టిగా పోరాడినా టైబ్రేకర్‌లో రెండు సెట్లను చేజార్చుకుంది. బ్లాక్‌హాక్స్ ఆటగాళ్లు హేమంత్ (9), కుమార్ సాహిల్ (7), స్టెఫెన్ (6) రాణించినా ఓటమి తప్పలేదు. లీగ్ దశలో ఆరు మ్యాచుల్లో ఐదింట ఓడిన బ్లాక్‌హాక్స్ ప్లేఆఫ్స్ ఆశలను ఆవిరి చేసుకుంది.