నింద సక్సెస్‌ ఖాయం

నింద సక్సెస్‌ ఖాయంవరుణ్‌ సందేశ్‌ హీరోగా ‘నింద’ అనే చిత్రాన్ని ది ఫెర్వెంట్‌ ఇండీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రాజేష్‌ జగన్నాథం నిర్మిస్తూ, దర్వకత్వం వహించారు. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 21న రాబోతోంది. మైత్రీ మూవీస్‌ ఈ సినిమాను నైజాంలో రిలీజ్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో మేకర్స్‌ నిర్వహించిన ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి హీరో నిఖిల్‌ సిద్దార్థ్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ,’నా కెరీర్‌లో ‘స్వామిరారా, కార్తికేయ’ ఎలా పడిందో.. ‘నింద’ అనేది వరుణ్‌ కెరీర్‌కు ఓ మైల్‌ స్టోన్‌లా మారాలి. ఈ మూవీని అందరూ చూసి ఎంజారు చేస్తారు. దర్శక, నిర్మాత రాజేష్‌ గురించి అందరూ మాట్లాడుకుంటారు. చాలా క్వాలిటీతో తెరకెక్కించారు’ అని తెలిపారు. ‘నా మనసుకు ఎంతో దగ్గరైన చిత్రమిది. రాజేష్‌ తన ప్యాషన్‌తో ఈ సినిమాను నిర్మించి, దర్శకత్వం వహించారు. ఆయనకు తన కథ మీద చాలా నమ్మకం ఉంది. ఎంతో గట్స్‌, కాన్ఫిడెన్స్‌తో నిర్మించారు. ఈ సినిమాను ఇండిస్టీలోని కొంత మందికి చూపించాం. ఆ తరువాత మాలో మరింత పాజిటివిటీ పెరిగింది’ అని వరుణ్‌ సందేశ్‌ చెప్పారు. దర్శక, నిర్మాత రాజేష్‌ జగన్నాథం మాట్లాడుతూ, ‘ఈ మూవీ అవుట్‌ పుట్‌ చూశాక నాకు చాలా సంతప్తి కలిగింది. అదే నేను సాధించిన విజయం అనిపించింది. వరుణ్‌ సందేశ్‌ ఈ మూవీతో కమ్‌ బ్యాక్‌ ఇస్తాడు. ఈ మూవీతోనే దానికి నాంది పడుతుంది’ అని అన్నారు.