నేడు ప్రభుత్వ హాస్టల్లో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం

నవతెలంగాణ -పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం లో స్థానిక శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి  తన సొంత ఖర్చులతో నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ హాస్టల్ విద్యార్థి విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ చేస్తున్నారని మండల అధ్యక్షులు పబ్బు యాదగిరి బుధవారం తెలిపారు.ఈ కార్యక్రమం లో  భాగంగా నేడు ఉదయం 10 గంటలకు మాజీ జెడ్పి వైస్ ఛైర్మెన్ కర్నాటి లింగారెడ్డి,హాలియా మార్కెట్ ఛైర్మెన్ తుమ్మల పల్లి చంద్ర శేఖర్ రెడ్డి మండల కేంద్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ  చేయడం జరుగుతుందని తెలిపారు. కావున ఈ కార్యక్రమాన్ని నాయకులు కార్యకర్తలు ప్రజలు హాజరు కాగలరని కోరారు.