– చెత్తకు నిప్పంటించడంతో ఘటన
– జీఎంఆర్ సిబ్బందికి గాయాలు
నవతెలంగాణ-హయత్‌నగర్
హైదరాబాద్ నగర శివార్లలోని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో పేలుడు కలకలం సృష్టించింది. ఇన్‌స్పెక్టర్ నాగరాజు గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. జీఎంఆర్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి సూర్యకళ రోజూలాగే శుక్రవారం ఉదయం పోలీస్ స్టేషన్ మొత్తాన్ని శుభ్రం చేసి.. ఆవరణలోని స్టోర్ రూం వెనుక చెత్తను క్లీన్ చేసి ఒక దగ్గర వేసి నిప్పంటించింది. అయితే అక్కడ ఉన్న పాత ఖాళీ బాటిల్స్, టైర్లు, చెత్త వల్ల పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. దాంతో అక్కడే ఉన్న ఆమెకు నుదుటిపై, ఎడమ కంటికి, అక్కడక్కడ స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఆమెను హయత్‌నగర్ సన్‌రైజ్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం వనస్థలిపురంలోని శారద కంటి ఆస్పత్రి లో పరీక్ష చేయించగా.. ఎలాంటి ప్రమాదమూ లేదని వైద్యులు చెప్పారు. ఘటనా స్థలాన్ని క్లూస్ టీం, బాంబు స్క్వాడ్ తనిఖీలు చేప ట్టాయి. రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రమాదానికి గల కారణాలు తెలియనున్నాయి.