న్యూఢిల్లీ: దేశీయ స్మార్ట్‌ఫోన్ కంపెనీ లావా కొత్తగా బ్లేజ్ సీరిస్‌లో కొత్త బ్లేజ్ ఎక్స్‌ను విడుదల చేసింది. 4జీబీ ర్యామ్ ధరలను రూ.13,999గా, 6జీబీ ధరను రూ.14,999గా, 8జీబీ వేరియంట్ ధరను రూ.15,999గా నిర్ణయించింది. జులై 20 నుంచి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో లభ్యం అవుతుందని ఆ కంపెనీ తెలిపింది. 64ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ అల్రావైడ్ కెమెరా సహా 16ఎంపీ సెల్ఫీ కెమెరాతో దీన్ని ఆవిష్కరించింది.