అభివృద్ధి చేశాను.. మళ్లీ ఆశీర్వదిచండి 

– ముత్తన్నపేట నివేదన సభలో ఎమ్మెల్యే రసమయి విజ్ఞప్తి 

– రూ.1.40 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం 
– ఇందిరమ్మ రాజ్యమంటే..ఎండిపోయే రాజ్యమేనని ఎద్దేవా
– పారదర్శకంగా గృహలక్ష్మి పథకం అమలు 
– విడతల వారిగా దళిత బందు 
నవతెలంగాణ-బెజ్జంకి 
మెట్టప్రాంతమైన మండలాన్ని గోదారి నీళ్లతో సస్యశామలం చేశానని..బురదరోడ్లతో దర్శనమిచ్చిన గ్రామీణ రోడ్లన్ని సీసీ రోడ్లతో,కుల,మహిళ సంఘాలు,నూతన గ్రామ పంచాయతీ భవనాలతో పాటు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు కృషితో మండలాన్ని అన్ని  రంగాల్లో అభివృద్ధి చేశానని..రానున్న ఎన్నికల్లో ప్రజలు మళ్లీ నన్ను ఆశీర్వదించాలని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విజ్ఞప్తి చేశారు.అదివారం మండల పరిధిలోని ముత్తన్నపేట గ్రామంలో సుమారు రూ.1.40 కోట్ల నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన ముత్తన్నపేట ప్రగతి నివేదిక సభలో ఎమ్మెల్యే రసమయి మాట్లాడారు.గత ఉమ్మడి అంద్రప్రదేశ్ రాష్ట్రంలో అంద్రపాలకుల చేతిలో తెలంగాణ రాష్ట్రంలోని బడుగుబలహీన వర్గాల ప్రజలెదుర్కొన్న కష్టాలను పాటల రూపంలో వెలుగులోకి తీసుకొచ్చి..తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించి మానకొండూర్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యానని..రసమయి నువ్వు చేశావని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలకు ఇదిగో ఇంత అభివృద్ధి చేశానని దైర్యంతో సగర్వంగా చెబుతున్నానని..అభివృద్ధి చేశాను కాబట్టే ప్రజలు మళ్లీ ఓట్లేసి అభివృద్ధికి పట్టం కట్టాలని..మళ్లీ ఆశీర్వదించమని అభ్యర్థిస్తున్నన్నారు. ప్రభుత్వం అమలు చేసిన పలు సంక్షేమ పథకాలను మండలంలోని అయా గ్రామాల్లో ఇంటింటా చేర్చానన్నారు. కాంగ్రెసోళ్లు ఒక్కసారి అధికారం కట్టబెట్టాలని గ్రామాల్లో ఇంటింటా తిరుగుతున్నారని వాళ్లు అధికారంలోకి వచ్చిన చేసేదేమి లేదని..ఇందిరమ్మ రాజ్యమంటే..ఎండిపోయే రాజ్యమేనని ఎద్దేవా చేశారు.గత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో కాంగ్రెస్ నాయకులు ఎవరి స్వార్థం కోరకు వారే పని చేసుకుని ఎన్నో అక్రమాలకు పాల్పడిన చరిత్ర ఉందని..నేడు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న గృహాలక్ష్మి పథకం ఆర్హులకు పారద్శకంగా అమలు చేస్తామన్నారు. దళిత బందు పథకం ఆర్హులైన వారందరికి విడతల వారిగా అందజేస్తానని సంయమనం పాటించాలని సూచించారు.కాంగ్రెసోళ్లు ఓటడిగితే ఎమి చేస్తారో చెప్పాలని ప్రజలు ప్రశ్నించాలని సూచించారు.గ్రామంలో బీసీ సామూహిక,అంగన్వాడీ భవనాలు,మిని వాటర్ ట్యాంక్ నిర్మాణానికి నిధులు మంజూరీ చేయాలని సర్పంచ్ కనగండ్ల రాజేశం,ఎంపీటీసీ కొలిపాక రాజు ఎమ్మెల్యేను కోరారు.అనంతరం పలువురు లబ్ధిదారులకు సీఎం రీలీప్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.గ్రామాభివృద్ధికి కృషిచేసిన ఎమ్మెల్యేను పంచాయతీ పాలకవర్గం,అంబేడ్కర్ యువజన సంఘం అధ్వర్యంలో శాలువ కప్పి ఘనంగా సన్మానించారు.ఎంపీపీ నిర్మల,జెడ్పీటీసీ కవిత,ఏఎంసీ చైర్మన్ చంద్రకళ,ఎంపీడీఓ దమ్మని రాము,కో ఆప్షన్ సభ్యుడు మహిపాల్ రెడ్డి, సర్పంచులు,ఎంపీటీసీల ఫోరంల అధ్యక్షులు సంజీవ రెడ్డి, మహేందర్ రెడ్డి,ఉప సర్పంచ్ సుధీర్ రెడ్డి,అయా గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు,బీఆర్ఎస్ నాయకులు, అంబేడ్కర్ యువజన సంఘాధ్యక్షుడు అంజయ్య,  గ్రామస్తులు హజరయ్యారు.
ఆకట్టకున్న చిన్నారి జ్ఞానశ్రీ పాట.. 
ఆట..పాట..మాట కలిపితే దూందాంమేనటా..మన తెలంగాణకై గర్జించెను రసమయన్న నీ పాట అంటూ గ్రామానికి చెందిన 9 ఎండ్ల బొర్ర జ్ఞానశ్రీ ఆలపించిన పాట ముత్తన్నపేట నివేదన సభలో ప్రత్యేకార్షణగా నిలిచి ప్రజలను ఆకట్టుకుంది.తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో నేను చేసిన పోరాటం గుర్తింపుఘా చిన్నారి జ్ఞానశ్రీ గుండెలో పాట రూపంలో స్థానం సంపాదించుకున్నాని ఎమ్మెల్యే రసమయి ఆనందం వ్యక్తం చేశారు.అనంతరం చిన్నారిని ఎమ్మెల్యే శాలువా కప్పి సన్మానించారు.