ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా

– అసీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి కొండమడుగు నర్సింహ
నవతెలంగాణ-భువనగిరిరూరల్‌
సీపీఐ(ఎం) సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాలని, భువనగిరిని అభివద్ధి చేస్తానని ఆ పార్టీ భువనగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కొండమడుగు నరసింహ కోరారు. సోమవారం రాత్రి ఆయన మండలంలోని బస్వాపురం గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం అందుబాటులో ఉండే ప్రజా సమస్యలపై పోరాటం చేసే కమ్యూనిస్టు పార్టీలను ఆదరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలోఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మటూరి బాలరాజు, కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్షులు అన్నంపట్ల కష్ణ, బస్వాపురం మాజీ సర్పంచ్‌ రాసాల నిర్మల వెంకటేష్‌, మాజీ ఉపసర్పంచ్‌ రమేష్‌, కొండ అశోక్‌, మండల కమిటీ సభ్యులు కొండమడుగు నాగమణి, నరాల చంద్రయ్య, ఉడత విష్ణు మద్దే పురం బాల నరసింహ, వెంకటేష్‌, ముదిగొండ కష్ణ, దేవేందర్‌, మచ్చ భాస్కర్‌, కవిత, కుకుట్ల కష్ణా, సత్యనారాయణ, రెహమాన్‌, ఎండి బాబు పాల్గొన్నారు.