బిడ్డగా ఆశీర్వదించండి.. సేవకుడిగా పనిచేస్తా

నవతెలంగాణ – కోదాడరూరల్‌
మీ బిడ్డకు ఆశీర్వదించండి సేవకుడిగా నియోజకవర్గ ప్రజలకు పనులు చేస్తా అని శాసనసభ్యులు, బిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్‌ అన్నారు . మంగళవారం గుడుగుండ్ల అప్పయ్య ఫంక్షన్‌ హాల్‌ లో వడ్డెర కుల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ ముఖ్య అతిథిగా హాజరీ మాట్లాడారు. గత ఐదు సంవత్సరాల నుంచి ప్రజలకు చెప్పిన హామీలు మొత్తం నెరవేర్చామని అన్నారు. కారు గుర్తుకు వేసిన ఓటు కోదాడలో ఎన్నో అభివద్ధి కార్యక్రమాలను తీసుకువచ్చింది అని అన్నారు. కాంగ్రెస్‌ మాటలు నమ్మి మోసపోవదని అన్నారు. రాష్ట్రం లో ఇళ్లు లేని వారు ఉండకూడదు అనేది సిఎం కేసిఆర్‌ లక్ష్యం అనీ, కోదాడ నియోజకవర్గం లొ కూడా ఇళ్లు లేని వారు ఉండకూడదు అనేదే నా శపథం అన్నారు. గత మ్యానిఫెస్టోలను నూటికి నూరు శాతం అమలు చేసిన ఏకైక నాయకుడు కేసిఆర్‌ అన్నారు.బీఆర్‌ఎస్‌ సర్కారు హయాంలో నే మహిళా సంఘాల అభివద్ధి జరిగిందన్న అన్నారు. ఇప్పటికే ఎంతో అభివద్ధి చేశామని, మరోసారి గెలిపిస్తే మరింత అభివద్ధి చేస్తానని భరోసా ఇచ్చారు. సీఎం కేసీఆర్‌ రూపొందించిన ఎన్నికల మ్యానిఫెస్టో అద్బుతంగా ఉందన్నారు. అనంతరం కుల పెద్దలందరూ ఎమ్మెల్యే ని ఘనంగా సన్మానించారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన వడ్డెర కులానికి చెందినవారు టిడిపి నాయకులు చింతల కొండల్‌, చల్లా వెంకట్‌ నారాయణ ఆధ్వర్యంలో 200 మంది కార్యకర్తలు బిఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వారికి మెడలో పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వడ్డెర సంఘం అధ్యక్షులు బత్తుల ఉపేందర్‌ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు చందు నాగేశ్వరరావు, పట్టణ మైనార్టీ నాయకులు నయీమ్‌ , కౌన్సిలర్‌ లు ఒంటి పులి రమా శ్రీనివాస్‌,చింతల నాగేశ్వరరావు, కుల సంఘ పెద్దలు చింతల లింగయ్య, పల్లపు పుల్లయ్య, అలకుంట్ల నరసింహ,రాపాణి, శ్రీను, వేముల వెంకన్న, తురక పిచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.