సీపీఐ(ఎం) అభ్యర్థి కొండమడుగు నర్సింహా ను  ఆశీర్వదించండి. 

పారదర్శక పాలన సీపీఐ(ఎం) తో సాధ్యం.

 మతసామరస్యం, లౌకికవాదం సిపిఎం లక్ష్యం
నవతెలంగాణ – భువనగిరి. 
నిరుపేద కుటుంబంలో పుట్టి పేదల అభ్యున్నతి కోసం సామాజిక సేవలో పనిచేస్తున్న ప్రజల పక్షపాతి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహులు భువనగిరి నియోజకవర్గం లో బలపరిచి ఆశీర్వదించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ విజ్ఞప్తి చేశారు. సోమవారం స్థానిక సుందరయ్య భవనం లో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ సాయుధ రైతాంగ విప్లవ పోరాటం యోధుడు రావి నారాయణరెడ్డి వారసత్వం పునికి పుచ్చుకున్న సిపిఎం అనేక ప్రజా ఉద్యమాలను నిర్మించి ఈ ప్రాంతంలో విజయం సాధించిందన్నారు. నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పూర్తి అవగాహన ఉండి వాటి పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఏకైక పార్టీ సీపీఐ(ఎం) అన్నారు. సామాజిక, ప్రజాస్వామ్య, లౌకిక, ప్రజాతంత్ర, అభ్యుదయవాదులు సీపీఐ(ఎం) అభ్యర్థి కొండమడుగు నరసింహను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. భువనగిరి ఎమ్మెల్యే గా రెండు  మార్లు ఎన్నికై బస్వాపురం ప్రాజెక్టు పూర్తి చేయించడంలో విఫలమైనారని తెలిపారు. కనీసం నియోజకవర్గం అసెంబ్లీలో ప్రస్తావించలేని వ్యక్తి అని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో మూసీ నది కాలువ మురికితో అత్యంత విషతుల్యమైన రసాయన పదార్థాలతో ప్రవహిస్తుందన్నారు. ఈ కాలువలోని నీటిని శుద్ధి చేయడానికి ప్రక్షాళనకు ఏనాడు ఎమ్మెల్యే పట్టించుకోలేదన్నారు. ప్రక్షాళన చేయలేని పక్షంలో గోదావరి జలాలను ఈ ప్రాంతానికి తరలించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో నివేదికలు అందజేస్తూ డిమాండ్ చేసిందన్నారు. సాగునీరు, త్రాగునీరు, విద్య, వైద్యము, రహదారులపై సిపిఎం కమిటీకి పూర్తి అవగాహన ఉందన్నారు. సీపీఐ(ఎం) మాత్రమే పారదర్శక పాలన అందిస్తుందన్నారు. ప్రజా సంక్షేమ పథకాలు గ్రామ సభల ద్వారానే ప్రజలకు అందే విధంగా కృషి చేసి గ్రామ స్వరాజ్యానికి కట్టుబడి ఉన్నామన్నారు. 2014లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తామన్న టీఆర్ఎస్ ప్రభుత్వం నేటికీ చేయలేదన్నారు. ఏనాడు ప్రజా ఉద్యమాలు నిర్మించడంలో వారి సమస్యలను పరిష్కరించడంలో బిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలో ఏనాడూ ప్రజల పక్షాన లేవన్నారు. విజన్ లేని పార్టీ బిజెపి అని పేర్కొన్నారు. నియోజకవర్గంలో మతసామారస్యం, లౌకికవాదం ఉండాలంటే సీపీఐ(ఎం) బలపరిచిన అభ్యర్థిని ప్రజలు గుర్తించి ఓట్లు వేసి గెలిపించాలన్నారు. దళితుల పేదవారి అభివృద్ధి కోసం పోరాటాలు చేసే వారిని గౌరవించే అసెంబ్లీకి పంపాలని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సీపీఐ(ఎం) అభ్యర్థి కొండమడుగు నరసింహ మాట్లాడుతూ భువనగిరి నియోజకవర్గం సిపిఎం అభ్యర్థిగా తనను రాష్ట్ర జిల్లా కమిటీలు ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు.తాను 35 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉంటూ ప్రజల సమస్యలపై పని చేస్తున్నానన్నారు. భువనగిరి మండలం ముత్తిరెడ్డి గ్రామానికి చెందిన తను భువనగిరి పట్టణంలోని బీచ్ మహల్ లాలో హైస్కూల్ విద్య చదివానన్నారు. 1982లో ఎస్ఎఫ్ఐ సంక్షేమ హాస్టల్స్ సమస్యలపై రాజీలేని పోరాటాలు చేశానన్నారు. 1992లో సిపిఎం సభ్యత్వం తీసుకొని ప్రజా సమస్యలపై నిరంతరం జరిగే పోరాటాల్లో పాల్గొన్నానని తెలిపారు. ప్రజానాట్యమండలి, కుల వివక్షత పోరాట కమిటీ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శిగా పనిచేశానన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామము మారుమూల ప్రాంతాలకు తో తనకు  అవగాహన ఉందని తెలిపారు. విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాక్షర అక్షరాస్యత కోసం కాలికి గజ్జే కట్టి, భుజాన గొంగడి వేసుకొని పాటలు పడుతూ ప్రజలను చదువు బాట పట్టేటట్లు చేశానన్నారు. అసంఘటితనంగా కార్మికులు చేనేత దళిత సామాజికంగా వెనుకబడ్డ వర్గాల కోసం పనిచేస్తూ సీపీఐ(ఎం) పూర్తి కాలం కార్యకర్తగా పనిచేశానన్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం నాడు జరిగిన 1887 కిలోమీటర్ల పాదయాత్ర బృందంలో తను ఉన్నానన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం నెల రోజులపాటు జిల్లా వ్యాప్తంగా జరిగిన పాదయాత్రలో ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకొని వాటికి పరిష్కారం కోసం పోరాటాలు చేశామన్నారు. భువనగిరి నియోజకవర్గం చాలా వెనుకబడ్డ ప్రాంతమని తెలిపారు. రాష్ట్ర రాజధానికి కోత వేటు లో ఉన్న ఈ ప్రాంతము విద్య వైద్యము ఆరోగ్యము అభివృద్ధిలో వెనుకబాటు తనము ఉందన్నారు. స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఉన్న మురుగు కాలువలను రోడ్లను ధ్వంసం చేసి బినామీలతో కాంట్రాక్టు పనులు చేయించారన్నారు. పోచంపల్లి మండలంలో భూముల అమ్మకాలు సింగిల్ విండో లక్షలాది రూపాయల కుంభకోణం అధికార పార్టీ నాయకులు చేశారన్నారు. ఏ అభ్యర్థి ఏ పార్టీలో ఉంటారో లేదో తెలవదని అలాంటి పరిస్థితులు భువనగిరి నియోజకవర్గంలో ఉన్నాయన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కుంభం అనిల్ కుమార్ రెడ్డి తన వ్యక్తిగత అవసరాల కోసం పార్టీలు మారుతుంటాడని విమర్శించారు. భవిష్యత్తులో అదే పార్టీలో ఉంటాడో లేదో అతనికే తెలవదని ఎద్దేవా చేశారు. బీజేపీ అభ్యర్థికి అధికార దాహం తప్ప నియోజకవర్గ సమస్యలు ప్రజలపై కనీస అవగాహన లేదన్నారు. బస్వాపురం ప్రాజెక్టుపై ప్రజా ఉద్యమానికి సీపీఐ(ఎం) మద్దతు ఇచ్చి ఆందోళన చేసిన ఫలితంగా ప్రభుత్వం దిగివచ్చి కొంత మేరకు పని చేసింది అన్నారు. చిన్న నీటి వనరుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. భువనగిరి పట్టణంలో టౌన్ హాలు అవు అవుట్డోర్ స్టేడియం రైల్వే ప్రయాణికుల కోసం రైలు నిలుపుదల కోసం కృషి చేస్తానన్నారు. ప్రస్తుతంబీజేపీ కాంగ్రెస్ బిఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులను కలవాలంటే హైదరాబాదుకు పోవాలని ఇది ప్రజలకు వ్యయ ప్రయాసలకు కారణమవుతుందన్నారు. తను మాత్రం ప్రజలకు అందుబాటులో ఉండడమే కాకుండా జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో ఎప్పుడు అందుబాటులో ఉంటానన్నారు. ఆ పార్టీల వారికి డబ్బులు ఉన్నాయని తనకు మాత్రం సామాజిక విప్లవ ప్రజా పోరాటాలే అండగా ఉంటాయన్నారు. ప్రభుత్వ డిగ్రీ సాంకేతిక విద్య కోసం కృషి చేస్తానన్నారు. వైద్య ఆరోగ్యం ప్రజలకు అందేటట్లు చేస్తానన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కల్లూరు మల్లేశం, నాయకులు దయ్యాల నరసింహ, గడ్డం వెంకటేష్, వనం రాజు, వడ్డబోయిన వెంకటేష్ పాల్గొన్నారు.