అసెంబ్లీలో కొట్లాడుతా.. ఆశీర్వదించండి..

నవతెలంగాణ- అశ్వారావుపేట:  సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే కార్మిక సంఘాలు బలపరిచిన అభ్యర్ధిగా నన్ను ఆశీర్వదించండి, మీ సమస్యలు పరిష్కారం కోసం అసెంబ్లీలో కొట్లాడుతా అని సీపీఐ(ఎం) అభ్యర్ధి పిట్టల అర్జున్ రావు తెలిపారు. గురువారం ఆయన అంగన్వాడి కార్యకర్తలను ఓట్లు అభ్యర్ధించారు. ఆయన వెంట ముళ్ళ గిరి గంగరాజు, మడిపల్లి వెంకటేశ్వరరావు లు ఉన్నారు.