అభివృద్ధికి బాటలు వేశా.. ఆశీర్వదించండి

– ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి
నవతెలంగాణ-ఆలేరుటౌన్‌
ఆలేరు నియోజకవర్గం అభివృద్ధికి బాటలు వేశాను, మూడోసారిగా ఆలేరు బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని,తనను ఆశీర్వదించాలని,రాష్ట్ర ప్రభుత్వ విప్‌, ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి. సునీత మహేందర్‌ రెడ్డి అన్నారు. ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం ప్రచారంలో భాగంగా సాయి గూడెం, పట్టణంలోని పలు వార్డులలో స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. మంగళ హారతులతో ఎమ్మెల్యేకు మహిళలు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్‌ వాయిస్‌ ఛైర్మెన్‌, పోరెడ్డి. శ్రీనివాస్‌,పురపాలక సంఘం చైర్మన్‌ వస్పరి శంకరయ్య, బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేశం, జిల్లా ఆర్టిఏ సభ్యులు పంతం బీఆర్‌ఎస్‌ పట్టణ మహిళా అధ్యక్షురాలు సీసా మహేశ్వరి, కష్ణ, కౌన్సిలర్లు, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
రైతు సంక్షేమమే బీఆర్‌ఎస్‌ లక్ష్యం
తుర్కపల్లి: రైతు సంక్షేమమే ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు బీఆర్‌ఏ ఎస్‌ పార్టీ లక్ష్యమని బిఆర్‌ఎస్‌ లక్ష్యమని ఆలేరు నియోజకవర్గం బిఆర్‌ఎస్‌ పార్టీ ఎంఎల్‌ఏ అభ్యర్థి గొంగిడి సునీత మహేందర్‌ రెడ్డి అన్నారు ఆదివారం తుర్కపల్లి మండలం సీఎం దత్తత గ్రామం వాసాలమర్రిలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు రామ్‌ శెట్టి పల్లి, కొండాపురం, శ్రీనివాస్‌ పురం, గోపాల్పురం, నాగాయపల్లి తండా, నాగయ్య పల్లి , చిన్న లక్ష్మాపురం, మాదాపురం గ్రామాల్లో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. 24 గంటల ఉచిత కరెంటు రైతులకు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం అని అన్నారు. మిషన్‌ భగీరథ మిషన్‌, కాకతీయ పథకాల లాంటి అనేక పథకాలను అమలు చేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూక్యా సుశీల రవీందర్‌ నాయక్‌ ,జెడ్పి వైస్‌ చైర్మన్‌ ధనావత్‌ బిక్కు నాయక్‌, మండల పార్టీ అధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్‌ రెడ్డి ,మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గట్టు తేజస్వి నిఖిల్‌, పిఎసిఎస్‌ చైర్మన్‌ సింగిరేణి నరసింహారెడ్డి ,ఎంపీటీసీలు పలుగుల నవీన్‌ కుమార్‌, గిద్దె కరుణాకర్‌ ,సర్పంచులు పోగుల ఆంజనేయులు,, నాంసాని సత్యనారాయణ నాంసాని సత్యనారాయణ ,శ్రీనివాస్‌ రెడ్డి, మాజీ ఎంపీపీ బబ్బూరి రవీంద్రనాథ్‌ మాజీ ఎంపీటీసీలు ఏసబోయిన రాజయ్య, ,మాజీ సర్పంచులు గోవిందు చారి, నర్సింలు ఉప సర్పంచ్‌ సీత రాజు, ఐఎంసి డైరెక్టర్లు, పిఎసిఎస్‌ డైరెక్టర్లు,, నాయకులు చాడ కరుణాకర్‌ రెడ్డి, సింగం వెంకటేశం, గ్రామ శాఖ అధ్యక్షులు కనక నాగరాజు ,గోనే జహంగీర్‌ పాల్గొన్నారు.