– మెదక్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి
నవతెలంగాణ- కౌడిపల్లి
ప్రజా క్షేత్రంలో సేవ చేయాలనుంది ఆశీర్వదించాలని మెదక్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి తెలిపారు. మండల పరిధిలోని రాయలపూర్ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం కౌడిపల్లి, కొల్చారం, చిలిపిచెడ్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, బీఆర్‌ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి హాజరయ్యారు. కార్యకర్తలనుద్దేశించి వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మెదక్ ఎంపీగా గెలిపిస్తే పివిఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి నిరుపేదలకు ట్రస్టు ద్వారా సేవలందిస్తానని తెలిపారు. పీడిగా, జాయింట్ కలెక్టర్ గా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించానని, పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలతో అనుబంధం ఉన్నదని తెలిపారు సుదీర్ఘంగా మెదక్ గడ్డపై ఏడు సంవత్సరాలు వివిధ హౌదాలలో నిజాయితీగా మచ్చలేని అధికారిగా పనిచేసి దేశంలో ఎక్కడా లేని విధంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం రావడం అదష్టంగా భావిస్తున్నానన్నారు ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపిస్తే మాజీ సీఎం కేసీఆర్, మాజీమంత్రి హరీష్‌రావుల సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివద్ధి చేయడానికి శాయశక్తుల కషి చేస్తానన్నారు. పివిఆర్ ట్రస్టు ద్వారా లావాదేవీలు ఆన్లైన్ చేసి వెబ్సైట్లో ఉంచడం జరుగుతుందన్నారు. విజయం సాధించిన వెంటనే 9 మాసాలలో ఏడు నియోజకవర్గాలలో 7 ఫంక్షన్ హాళ్లు నిర్మించి కేవలం ఒక్క రూపాయికే బిఆర్‌ఎస్ శ్రేణులకు సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేగా తన విజయానికి వెంకట్రాంరెడ్డి ఎంతో కషి చేశారన్నారు. పరిపాలనపై మంచి అనుభవమున్న వ్యక్తి వెంకట్రామిరెడ్డి అని తెలిపారు వెంకట్రాంరెడ్డిని మెదక్ ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించడానికి అందరూ కషి చేయాలన్నారు. అనంతరం తునికి గ్రామ శివారులో వెలసిన శ్రీ నల్లపోచమ్మ జాతర ఉత్సవాలలో పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో మోహన్ రెడ్డి పూజారి శివప్ప ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సమావేశంలో ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షులు ప్రవీణ్ కుమార్, ఉమ్మడి జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ చంద్ర గౌడ్, ఎంపీపీ రాజు నాయక్, సోంపేట ఎంపీపీ హరికష్ణ, వైస్ ఎంపీపీ నవీన్, మండల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు సారా రామాగౌడ్, నాయకులు శ్యాంసుందర్రావు, కాంతారావు, నాయకోటి లింగం పటేల్, దుర్గా రెడ్డి మహిపాల్ రెడ్డి జిల్లా కో ఆప్షన్ మెంబర్ మన్సూర్, బీఆర్‌ఎస్ నాయకులు సింగయ్యపల్లి గోపి ఎంపీపీ మంజుల జిల్లా అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షులు సంజీవ్, అమర్ సింగ్, బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్లు ప్రతాప్ గౌడ్, రామాంజనేయులు, నియోజకవర్గ బిఆర్‌ఎస్ ప్రముఖ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.