నవతెలంగాణ/అన్నపురెడ్డిపల్లి
రాష్ట్రం నీళ్ళు, నిధులు, నియామకాలకు ఎటువంటి లోటు లేకుండా ఉండాలని ప్రాణ త్యాగానికి సిద్ధపడి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సాధించారని అలాంటి తెలంగాణలో పోరాటాల పురిటి గడ్డ బిడ్డగా ఖమ్మం జిల్లా అభివద్ధి ప్రదాతగా మీ ముందుకు వచ్చాను అని హ్యాట్రిక్ ఎంపీగా మూడవ సారి గెలిపించి పార్లమెంట్ కు పంపించాలని నామ నాగేశ్వరరావు కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో సోమవారం రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీలు అని ప్రజలకు ఉచిత హామీలు ఇచ్చి అధికారం వచ్చాక ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసినారని, ఇప్పుడు మరోసారి పార్లమెంట్ ఎన్నికలు సందర్భంగా మోసానికి పాల్పడుతూ మోసం చేయాలని చూస్తున్నారని ప్రజలు గమనించి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సుధాకర్ రావు, మాజీ శాసన సభ్యులు తాటి వెంకటేశ్వర్లు, మెచ్చా నాగేశ్వరావు, జడ్పీటిసి భారత లాలమ్మ(లావణ్య), ఎంపిటిసి కష్ణారెడ్డి, భారత రాంబాబు, వైస్ యంపిపి రామారావు, నర్సారెడ్డి, చల్లా రాంబాబు, చల్లా రమేష్, నాగరాజు, అచ్చన రామకష్ణ తదితరులు పాల్గొన్నారు.