అన్ని రంగాల్లోనూ అభివద్ధి చేశా… ఆశీర్వదించండి

– బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కిశోర్‌కుమార్‌
నవతెలంగాణ-తిరుమలగిరి
పదేండ్ల కాలంలో తుంగతుర్తి నియోజక వరాన్ని అన్ని రంగాలలో అభివద్ధి చేశా.మరో మారు ఆశీర్వదించి గెలిపించండి.అభివద్ధిని కొనసాగిద్దామని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి గాదరి కిశోర్‌కుమార్‌ అన్నారు.మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని నెల్లిబండతండా, ఈదులపర్రేతండా, మండలంలోని తాటిపాముల గ్రామంలో పర్యటించారు.ఆయా గ్రామంలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో మహిళల కోలాటాలు, డప్పు చప్పులతో భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల అభివద్ధికి కషి చేశారన్నారు.తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. నీళ్లు లేక బీటలు వారిన నేలలకు మూడు పంటలకు కాలేశ్వరం ద్వారా సాగునీరు అందించి సస్యశ్యామలం చేశారన్నారు. అదేవిధంగా దళితులు ఆర్థికంగా ఎదగాలని ఆలోచనతో సీఎం కేసీఆర్‌ దళిత బంధు పథకం ఏర్పాటు చేస్తే, ఆ పథకాన్ని తిరుమలగిరి మండలానికి తీసుకొచ్చి ఈ ప్రాంతం వారికి దళిత బంధును అందించానన్నారు.కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మళ్లీ కరెంట్‌ కష్టాలు తప్పవన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు సంకేపల్లి రఘునందన్‌ రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పోతరాజు రజిని రాజశేఖర్‌, మాజీ ఎంపీపీ కొమ్మినేని సతీష్‌, పిఎసిఎస్‌ చైర్మన్‌ పాలెపు చంద్రశేఖర్‌, బీిఆర్‌ఎస్వీ జిల్లా నాయకులు కల్లట్లపల్లి శోభన్‌, తాటిపాముల గ్రామ సర్పంచ్‌ ఎర్ర శోభ శ్రీనివాస్‌, వార్డ్‌ కౌన్సిలర్లు, ఎంపిటిసిలు గ్రామ శాఖ అధ్యక్షులు, పార్టీ నాయకులు నాని, బాబు, అడ్డబొట్టు చారి, ఆనగందుల మల్లేష్‌, కందుకూరి పవన్‌ పాల్గొన్నారు.