హైదరాబాద్ : వచ్చే నెల 4 నుంచి 7 వరకు తెలంగాణ బ్లైండ్ క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్టు ది తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం (టీడీసీఏ) అధ్యక్షుడు అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా ఆరు జట్లు పోటీపడుతున్న బ్లైండ్ చాలెంజర్ కప్ టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమానికి రాష్ట్ర డిజిపి జితేందర్ హాజరు కానున్నారు. ఈ మేరకు టీడీసీఏ అధ్యక్షుడు అల్లీపురంతో కలిసి బ్లైండ్ క్రికెట్ సంఘం ప్రతినిధులు గురువారం డిజిపిని ఆయన కార్యాలయంలో కలిసి ఆహ్వానించారు.