అంధుల టి20 ప్రపంచ ఛాంపియన్‌ పాకిస్తాన్‌

ముల్తాన్‌: అంధుల క్రికెట్‌ జట్టు టి20 ప్రపంచకప్‌ టైటిల్‌ను పాకిస్తాన్‌జట్టు కైవసం చేసుకుంది. మంగళవారం జరిగిన ఫైనల్లో పాక్‌ 10వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. ముల్తాన్‌ వేదికగా జరిగిన ఫైనల్లో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 139పరుగులు చేసింది. ఆరిఫ్‌ హుస్సేన్‌(54) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. పాక్‌ బౌలర్లలో బాబర్‌ అలీ రెండు, మొహమ్మద్‌ సల్మాన్‌, మతివుల్లా తలో వికెట్‌ దక్కించుకున్నారు. ఆ లక్ష్యాన్ని పాకిస్తాన్‌ కేవలం 11 ఓవర్లలో ఒక వికెట్‌ కోల్పోయి ఛేదించింది. ఓపెనర్‌ నిసార్‌ అలీ అజేయమై అర్ధ సెంచరీతో(72)కి తోడు మరో ఓపెనర్‌ మొహమ్మద్‌ సఫ్దార్‌(47నాటౌట్‌) గెలుపులో కీలకపాత్ర పోషించారు. 12ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో పాక్‌ టైటిల్‌ గెలవడం ఇదే తొలిసారి.