
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ అడ్డు దారికి అదుపు చేయకపోతే రాష్ట్రానికి వచ్చే ఆదాయం లక్షల్లో కోల్పోవలసి వస్తుందని ప్రజల్లో ఆవేదన వ్యక్తం అవుతోంది. తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా సరిహద్దులో, మహారాష్ట్రకు పూర్తిగా బార్డర్ లోని మద్నూర్ మండల కేంద్రం మీదుగా పెద్ద తడగూర్ అడ్డ దారి గుండా మహారాష్ట్రకు రాత్రింబవళ్లు వందల సంఖ్యలో సరుకు వాహనాలు అక్రమ రవాణా కొనసాగిస్తున్నాయి. ఈ అడ్డ దారి గుండా అక్రమ రవాణా జరిపే సరుకు లారీల ద్వారా రాష్ట్ర ఆదాయానికి రోజువారి లెక్కల్లో లక్షలాది రూపాయలు ఆదాయం కోల్పోవలసి వస్తుందని మండల ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అక్రమ రవాణాకు ఈ అడ్డదారి వాహనదారులకు అడ్డు అదుపు లేకుండా పోవడంతో రాత్రి పగలు తేడా లేకుండా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల సమయం జాతీయ రహదారిపైనే వాహనాల తనిఖీల చెకింగ్ చెక్పోస్టు కొనసాగిస్తున్నారు. అక్రమ అడ్డుదారికి ఎలాంటి చెకింగ్ లు లేకపోవడంతో అక్రమ రవాణా దారులు ఈ అడ్డుదారి గుండా వాహనాలను తరలిస్తున్నారు. ఒకటైతే సరుకులకు పన్ను చెల్లించలేకపోవడం రెండవది అధిక లోడుతో రవాణా శాఖకు రావలసిన ఆదాయం రాకపోవడం ఎన్నికల సమయం అయినందున మద్యం గానీ, డబ్బులు గానీ అడ్డుదారుల గుండా తరలించే అవకాశం జోరుగా కొనసాగుతున్నట్లు మండల ప్రజల్లో ఆవేదన వ్యక్తమవుతున్నాయి. మన రాష్ట్ర సరిహద్దు మహారాష్ట్ర ప్రాంతంలో వాహనాలకు వేబిడ్జ్ తూకాల ద్వారా ఓవర్ లోడ్ సరుకుల పైన పన్ను విధిస్తున్నారు. అలాంటి అంతరాష్ట్ర చెక్పోస్టు తప్పించే మార్గంలో అడ్డుదారు గుండా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. మహారాష్ట్ర నుండి తెలంగాణలోకి ఇటు నుండి మహారాష్ట్రలోకి అక్రమ రవాణాకు మండల కేంద్రం మీదుగా పెద్ద తడగూర్ రోడ్డు అడ్రస్ గా మారింది. ఈ అడ్డదారికి అక్కడి మహారాష్ట్ర ప్రభుత్వము గానీ ఇక్కడి తెలంగాణ ప్రభుత్వంగానీ అడ్డుకట్ట వేయలేకపోవడంతో ఇరు రాష్ట్రాలకు లక్షల్లో ఆదాయం కోల్పోవలసి వస్తుందని, ఇంత పెద్ద రవాణా అక్రమంగా జరుగుతుంటే అధికారులు ఏమాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారని ప్రజల్లో ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అడ్డు దారి ఎన్నికల సమయానికి కాకుండా శాశ్వతంగా అడ్డుకట్ట వేస్తేనే రాష్ట్ర ఆదాయానికి గండి పడకుండా ఉంటుందని ప్రజల్లో ఆవేదన వ్యక్తం అవుతుంది. అడ్డుదారి గుండా లక్షల్లో ఆదాయం కోల్పోతుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై మండల ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడో ఏదో జరుగుతుందని అనుమానాలు ప్రజల్లో చర్చలు వినబడుతున్నాయి. ఇంత పెద్ద అక్రమ రవాణా రాష్ట్ర ఆదాయానికి గండి పడుతుంటే పట్టించుకోరేమి అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ అడ్డు దారి అక్రమ రవాణాకు అడ్రస్ గా మారడం జాతీయ రహదారి గుండా కాకుండా అధిక వాహనాలు అక్రమ రవాణా గుండానే వెళ్తున్నాయి. అక్రమ రవాణా గురించి పలుమార్లు పత్రికల్లో వార్తలు వెలువరిస్తున్నప్పటికీ, ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడం రాష్ట్ర ఆదాయం పూర్తిగా కోల్పోవలసి వస్తుందని ప్రజల్లో ఆవేదన వ్యక్తం అవుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుదారి గుండా అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసి రాష్ట్ర ఆదాయానికి గండి పడకుండా చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.