– లిక్వాంటం కంప్యూటింగ్‌లో ‘సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్’ :
– ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి
నవ తెలంగాణ – హైదరాబాద్
తెలంగాణలో బ్లాక్ చైన్ సిటీని ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖమంత్రి డి శ్రీధర్ బాబు అన్నారు. ఎక్కడ, ఎంత విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలనే అంశంపై ఇప్పటికే సంబంధిత పరిశ్ర మలు, నిపుణులతో సంప్రదిం పులు ప్రారంభించామని వెల్లడించారు. శుక్రవారం మాదాపూరలో డ్రోన్ టెక్నాలజీ, రోబోటిక్స్ రంగంలో భారీగా ఉపాధి కల్పిస్తున్న ‘సెంటిలియన్ నెట్ వర్క్స్ అండ్ హెచ్‌సి రోబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్’ నూతన క్యాంపస్‌ను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ‘కొత్త సాంకేతికల ఆవిష్కరణలో తెలంగాణను నంబర్ వన్‌గా నిలిచేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నాం. ఆయా రంగాల్లో తెలంగాణ యువతకు స్కిల్స్ యూనివర్సిటీ, పరిశ్రమల సహకారంతో శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఫ్యూచర్ సిటీలో నిర్మించ తలపెట్టిన ఎఐ యూనివర్సిటీకి త్వరలో శంఖుస్థాపన చేయబోతున్నాం. ప్రత్యేకంగా క్వాంటం కంప్యూటింగ్‌లో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను ప్రారంభించబోతున్నాం’ అని తెలిపారు. ఇటీవలి కాలంలో కీలకంగా మారిన డ్రోన్ టెక్నాలజీపై తెలంగాణ యువతకు ప్రత్యేకంగా శిక్షణను ఇచ్చి వారికి ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు.