
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం స్వామి వివేకానంద 161వ జయంతి సందర్భంగా గ్రామ యువకుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. గ్రామానికి చెందిన 45 మంది యువకులు ఈ శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు.నిజామాబాద్ జిల్లా బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తదానం చేసిన యువకుల నుండి రక్తాన్ని సేకరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రక్తదానం ఎంతో గొప్పదని, రక్తదానం ప్రాణదానం తో సమానం అన్నారు. యువకులు అందించిన రక్తం 45 మందికి ప్రాణాలు నిలబెడుతుందని పేర్కొన్నారు. రక్తదానం చేసిన యువకులకు మెమొంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శాంతి కుమార్, ఉపసర్పంచ్ చిన్న గంగారం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయన్న, గ్రామ యువకులు నవాతే రంజిత్ కుమార్, నల్ల గణేష్ గుప్తా, పలహారం యాదగిరి, ప్రభాకర్, వినీత్, రాజశేఖర్, అజయ్, నరేందర్ ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.