రాంచంద్రపల్లిలో 20న రక్తదాన శిబిరం

నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని రాంచంద్రపల్లి గ్రామంలోని హెల్పింగ్ అండ్ అసోసియేషన్ అధ్వర్యంలో ఈ నెల 20న మంగళవారం రోజు రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు హెల్పింగ్ అండ్ అసోసియేషన్ అధ్యక్షులు తౌడ్ మహేష్ పత్రిక ముఖంగా ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదాన చేయడానికి ఇప్పటి వరకు 30 మంది ముందుకు వచ్చారని, మంగళ వారానికి ఇది ఇంకా పెరుగుతుందని తెలిపారు. రక్తదాన శిబిరాన్ని వచ్చిన వారికి బోజన సదుపాయం ఏర్పాటు చేస్తున్నామన్నారు. హెల్పింగ్ హాండ్స్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం నిర్వహించిన రక్తదాన శిబిరాల వల్ల దాదాపుగా ఒక 36 మంది ప్రాణాలు కాపాడడం జరిగిందనీ, 36 మంది వ్యక్తులకు అత్యవసర సమయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా రక్తం ఇప్పించడం జరిగిందన్నారు. అందులో యాక్సిడెంట్ అయిన వ్యక్తులు, గర్భవతులు, బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉన్నవారు ఉన్నారని తెలియజేశారు. రక్తదానం మరో ప్రాణాన్ని కాపాడుతుందని తెలిపారు. అలాగే ఈ శిబిరంలో కోటపాటి నర్సింహ నాయుడు పాల్గొంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో యుతు సభ్యులు పాల్గొన్నారు.