నవతెలంగాణ- డిచ్ పల్లి: తెలంగాణ యూనివర్సిటీ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఎన్ ఎస్ ఎస్ యూనిట్స్ (1,2,3&4), చీఫ్ వార్డెన్ ఆధ్వర్యంలో తలస్సేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదాన శిబిరాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం .యాదగిరి, ముఖ్యఅతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ అన్ని దానాల కెల్లా రక్తదానం గొప్పదని ప్రతి విద్యార్థులు, అధ్యాపకులు, అధ్యాపకేతరులు, సిబ్బంది ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ఈ రక్తదానం వెలకట్టలేనంత గొప్పగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్.ఆరతి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఆరు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తే ఆరోగ్యం బాగుంటుందని వివరించారు. ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త ప్రోఫేసర్ కే రవీందర్ రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి పేదలకు సేవలందించాలని పేర్కొన్నారు. చీఫ్ వార్డెన్ ఐలేని మహేందర్ మాట్లాడుతూ ఈ రక్తదాన శిబిరం లో హాస్టల్ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనడం ఆనందకరంగా ఉందని అన్నారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్. బి . స్రవంతి, డాక్టర్ ఎన్. స్వప్న,అసిస్టెంట్ రిజిస్ట్రార్ విజయలక్ష్మి, సూపరిండెంట్ ఉమారాణి, వార్డెన్లు గంగ కిషన్, కిరణ్, డాక్టర్ దత్తారి తదితరలు పాల్గొన్నారు.