మండలంలోని తడపాకల్ గ్రామంలో స్పందన ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఫౌండేషన్ అధ్యక్షులు నలిన్ ఇల్లెందుల తెలిపారు. ఫౌండేషన్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని, మనం చేసే రక్తదానం, ఇతరులకు ప్రాణదానం అని అన్నారు. రక్తదానం చేయడం వల్ల అనేక లాభాలున్నాయని, అపోహలను నమ్మవద్దని తెలిపారు.ఇందులో భాగంగా ప్రాణధార సొసైటీ అర్మూర్ సభ్యులు ప్రతాప్, ప్రవీణ్, సుమన్, తదితరులు పాల్గొన్నారు.