రక్తదానం ఓ సామాజిక బాధ్యత

Blood donation is a social responsibilityనవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రతీ పౌరుడు రక్త దానాన్ని ఒక సామాజిక బాధ్యత గా కొనసాగించాలని సీఐ కరుణాకర్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో బాగంగా శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో రథదాన శిభిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తం ఇవ్వడంతో ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉత్పన్నం కావని,మరొకరి ప్రాణం కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని తెలిపారు. రక్తదానం చేయటం వల్ల ఏవో సమస్యలు ఉంటాయనే అపోహలు పెట్టుకోవద్దని స్పష్టం చేశారు.రక్తం అందక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని.అటువంటి పరిస్థితుల్లో చేయూతనిద్దామని పిలుపునిచ్చారు.అనంతరం రక్తదానం చేసిన వారికి జ్యూస్ పంపిణీ చేసి అభినందించారు. కార్యక్రమంలో అశ్వారావుపేట, దమ్మపేట ఎస్సైలు యయాతి రాజు,సాయి కిషోర్ రెడ్డి, పలువురు స్వచ్చంద సంస్థ బాధ్యులు పాల్గొన్నారు.