అన్ని దానాలకెల్లా రక్తదానం మిన్న అని, ఒక వ్యక్తి రక్తదానం చేయడంతో ఆపదలో ఉన్నటువంటి నలుగురు వ్యక్తులను ఆదుకోవచ్చని ఆర్మూర్ లోని స్వామి బాయ్ బ్లడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మాదరి స్వామి పేర్కొన్నారు. జక్రాన్ పల్లి మండలం లో నీ,మనోహరాబాదు గ్రామానికి చెందిన పాత్రికేయుడు,ఆర్.రమేశ్ స్వచ్ఛందంగా ఆర్మూర్ లోని స్వామిబాహి బ్లడ్ ఫౌండేషన్ కు “,ఏ పాజిటివ్ ” రక్తాన్ని డొనేట్ చేయడం జరిగిందన్నారు. సమాజ హితం కోసం పాత్రికేయులు అనేక విధముగా సమాజ అభివృద్ధికి పాటుపడుతున్నారని దాంతోపాటు, సామాజిక సేవ రంగంలో కూడా వారు పాత్ర ముందు ఉండడం చాలా అభినందియమని అన్నారు. ఈ ఈ సందర్భంగా పాత్రికేయుడు ఆర్ రమేష్ ను ఆయన అభినందించారు.