ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా రక్తదానం

నవతెలంగాణ – నవీపేట్: భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా బిజెపి ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం వద్ద ఆదివారం రక్తదానం చేశారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడిపాటి ప్రకాష్ రెడ్డి తో పాటు నాయకులు,కార్యకర్తలు 25 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వడ్డీ మోహన్ రెడ్డి, మేడిపాటి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ బిజెపి పార్టీ సామాజిక బాధ్యతతో పనిచేస్తుందని అందులో భాగంగానే ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా స్వచ్ఛందంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. అనంతరం విశ్వకర్మ దినోత్సవం సందర్భంగా విశ్వకర్మ కులస్తులకు సన్మానించారు.  అంతకుముందు కేక్ కట్ చేసి ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సరీన్, నియోజకవర్గ కన్వీనర్ శ్రీధర్, ప్రధాన కార్యదర్శి ఆనంద్, రామకృష్ణ, రాజేందర్ గౌడ్, మువ్వ నాగేశ్వరరావు, గణేష్, రాము, బాలగంగాధర్, భాను గౌడ్, బండారి శేఖర్, బునాది నవీన్, అంకిత తదితరులు పాల్గొన్నారు.