ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రక్తదానం

నవతెలంగాణ – మోపాల్
మోపాల్ మండల కేంద్రంలో గురువారం రోజున బొబ్బ నరసింహారావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని మహాలక్ష్మి చికెన్ సెంటర్ ప్రక్కన రక్తదాన శిబిరాన్ని ఆయన ఏర్పాటు చేసి దాదాపు 50 మంది యువకులు రక్తదానాన్ని  లైన్స్ క్లబ్ ఆఫ్ సహారా వారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ ఎన్టీ రామారావు మరణించినా కూడా ఇప్పటికే ప్రజల హృదయాలు నిలిచి ఉన్నాడని ఆయన చేసిన సేవలు తెలుగు రాష్ట్రానికే గర్వ కారణమని ముఖ్యంగా పేదవారికి రెండు రూపాయల కిలో బియ్యం అప్పట్లో ఏర్పాటుచేసి ప్రజలందరి మన్నన పొందిన మహనీయుడని, సినీ రంగంలో కూడా ఆయన నటనకు ఎవరు సాటి రారని అటువంటి మహా నాయకుడిని మనం నిరంతరం గుర్తుంచుకోవాలని ఆయన కొని ఆడారు. అలాగే ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిమ్మగడ్డ తరుణ్ గంగా ప్రసాద్ శ్రీకాంత్ కొండవీటి కిరణ్, రఘు పటేల్, మోపాల్ యువకులు పెద్ద మొత్తంలో పాల్గొనడం జరిగింది