రక్తంలో హిమోగ్లోబిన్‌ తగ్గకుండా వుండాలంటే…

రక్తంలో హిమోగ్లోబిన్‌ తగ్గకుండా వుండాలంటే...– సాధారణంగా టీనేజ్‌ అమ్మాయిలలో రక్తహీనత సమస్యను చూస్తుంటాం. అలాగే గర్భిణీలలో ఈ సమస్య చాలా ఎక్కువగా కనిపిస్తుంది.
– ఇండియాలోని 90 శాతం మహిళల్లో ప్రొటీన్‌ లోపం వుంటుంది. ప్రొటీన్‌ లోపం వున్నవాళ్లు తరచూ హిమోగ్లోబిన్‌ లోపంతో బాధపడుతుంటారు.
– ఈ సమస్య ప్రెగెన్సీ మహిళలకు ప్రమాదకరం. దీనిని అధిగమించడానికి ఆహారం తీసుకున్న తర్వాత ఎక్కువగా ‘విటమిన్‌ సి’ వున్న పదార్థాలు తీసుకోవాలి.
– నాన్‌వెజ్‌ ఐరన్‌ వున్న ఆహారం : మటన్‌, లివర్‌, మటన్‌ కీమా, గుడ్డు పచ్చసొన, చేపలు.
వెజిటేరియన్‌ ఐరన్‌ వున్న ఆహారం : ఆకుకూరలు. ముఖ్యంగా తోటకూర, మనగాకు, బచ్చలికూర, సజ్జలు, వాటర్‌మిలన్‌, బెల్లం, ఖర్జూర, నల్లద్రాక్ష, కిస్‌మిస్‌, దానిమ్మ, బొప్పాయి, క్యారట్‌, యాపిల్‌, అటుకులు, రాగులు తీసుకోవాలి.
ఉదా : మటన్‌ లివర్‌ + నిమ్మరసం, ఖర్జూర + నిమ్మరసం, రాగిజావ, ఖర్జూర + జామకాయ, బొప్పాయి+ ఉసిరిపొడి, దానిమ్మ + ఆకుకూరలు + జామ. ఏదైనా ఐరన్‌ ఫుడ్‌ తీసుకున్నప్పుడు ‘విటమిన్‌ సి’ ఆహారంలో చేర్చితే మరింత ఉపయోగకరం.
– పి.వాణి, 9959361180
 Msc nutrition & DietiticsCheif dietician
11Am-8Pm
(consultationtimings)