ప్రభుత్వ పాఠశాలలో రక్తం మరకలు..

నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో శుక్రవారం హరిజనవాడ కాలనీలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో రక్తం మరకలు కనిపించడంతో గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన వ్యక్తికి గురువారం రాత్రి తీవ్ర గాయాలు కావడంతో పాఠశాలలోనే నిద్రించినట్లు ఉదయం తిరిగి ఇంటికి వెళ్లి పోయినట్లు తెలిపారు. ఉదయం సమయంలో పాఠశాలకు వస్తున్న విద్యార్థులు రక్తం మరకలు చూసి ఉపాధ్యాయులకు, గ్రామస్తులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు ఆరా తీశారు. తీరా గ్రామానికి చెందిన వ్యక్తికి తీవ్ర గాయాలైన కారణంగా పాఠశాలలో పడుకున్నట్లు గుర్తించడంతో అందరూ ఊపిరిపించుకున్నారు. ఒక్కసారిగా రక్తం మరకలు కనబడడంతో పాఠశాలలో ఏదైనా హత్య జరిగిందా లేదా దేనినైనా జంతువులను చంపేశారా అన్న అనుమానంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. తీరా గ్రామానికి చెందిన వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు విషయం తెలుసుకొని అందరూ ఊపిరిపించుకున్నారు.