విద్యార్థులకు రక్త పరీక్షలు

నవతెలంగాణ – భీంగల్
పట్టణ కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో 8 ,9, 10  తరగతుల విద్యార్థులకు ఆర్ బి ఎస్ కే  టీం, ఆశా వర్కర్లు రక్తంలోని హిమోగ్లోబిన్ పరీక్షలను గురువారం నిర్వహించారు.  విద్యార్థులకు రక్తంలో హిమోగ్లోబి శాతం తక్కువగా ఉండటం వలన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని కనుక  పౌష్టికమైన ఆహారాన్ని తీసుకోవాలని  ఎం ఈ ఓ స్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రఘువస్, లింబాద్రి, వాసుదేవ్  తదితరులు ఉన్నారు.