తెలంగాణ లో నీలి విప్లవం

-ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
-మత్స్యకారులకు వరంగా సాగు నీటి ప్రాజెక్టులు
-ఘనంగా పెరిగిన మత్స సంపద
-గంగ పుత్రులకు సబ్సిడీ లో వాహనాలు పంపిణి
-ముఖ్యమంత్రి  కేసీఆర్  అమలు చేస్తున్న పథకాలతో మత్సకారుల ఇంట వెలుగులు
-అర్సపల్లి లో నిర్మాణం లో ఉన్న చేపల మార్కెట్
-అభివృద్ధి చేశాము
-గంగ పుత్ర ఆత్మీయ సమ్మేళనం లో  ఎమ్మెల్యే గణేష్ బిగాల
నవతెలంగాణ కంఠేశ్వర్ :
2 కోట్ల రూ. లతో ఆధునిక సదుపాయలతో చేపల మార్కెట్ నిర్మాణం చేపట్టడం జరిగిందని, వినాయక్ నగర్ గంగ పుత్ర సంఘం కమ్యూనిటీ హల్ కొరకు 5 లక్షలు మంజూరు చేయడం జరిగిందని, నిజామాబాద్ నగరం లో పోటా పోటీగా అభివృద్ధి – సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, ప్రజలకు ఉత్తమ సేవలు అందించడమే మా లక్ష్యం అని  నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల అన్నారు. ఈ మేరకు బుధవారం నిజామాబాద్ నగరం లోని జనార్దన్ గార్డెన్స్ లో గంగ పుత్ర ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల  మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి  కేసీఆర్ చేపట్టిన అనేక కార్యక్రమాల ద్వారా మత్స సంపద గణనీయంగా పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మిషన్ కాకతీయ ద్వారా చెరువులు నిండు కుండల మారాయి.సాగు నీటి ప్రాజెక్టులు, చెరువులు మత్సకారుల కి వరంగా మారాయి.రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు సబ్బిడి పై వాహనాలు పంపిణీ పంపిణీ చేస్తుంది.రాష్ట్రంలో 13 లక్షల మంది మత్సకారులు కుల వృత్తి పై ఉపాధి పొందుతున్నారు. నిజామాబాద్ నగరంలో చేపల మార్కెట్ నిర్మాణం లో ఉంది. నిజామాబాద్ నగరం లో చేపల మార్కెట్ అందుబాటులో కి వస్తే మత్సకారుల కి ఉపాధి  భించడంతో పాటుగా నగర ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది.అహ్మది బజారులో మార్కెట్ లో చేపల విక్రయ కేంద్రం ఏర్పాటు చేసి గంగ పుత్రులకు ఉపాధి కల్పించాలని నిర్ణయించాము. నిజామాబాద్ నగరం లో పోటా పోటీగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. అభివృద్ధి పనులలో భాగంగా ఆధునిక సదుపాయలతో వైకుంఠ దామాలు నిర్మించాము. ఐటి టవర్ ని నిర్మించి స్థానిక యువతకు ఉపాధి కల్పించాము. నగర ప్రజలు సేదా తీరాడానికి మినీ ట్యాంక్ బండ్ ని నిర్మించాము. నిజామాబాద్ నగరం లోని ప్రతి డివిజన్ లో సిసి రోడ్లు, డ్రైనేజి లు నిర్మించాము. సంక్షేమం లో భాగంగా ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు ప్రజలకు అందిస్తున్నాము. మరోసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి లో హైదరాబాద్ తరువాత స్థానం నిజామాబాద్ ఉండేలా కృషి చేస్తానని మాటిస్తున్నాను. ఈ కార్యక్రమంలో నగర మేయర్  దండు నీతు కిరణ్, నూడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, దండు శేఖర్, సిర్ప రాజు, గంగ పుత్ర సంఘం నాయకులు పల్లికొండా అన్నయ్య, మాకు రవి, జూంబరతి గంగామణి,కార్పొరేటర్ లు వెల్డింగ్ నారాయణ, సాయి వర్ధన్, నాయకులు ఎర్రం గంగాధర్, రంగు సీతారామ్, పుప్పాల బాజన్న, ముత్యాలు, మధు సుధన్ తదితరులు పాల్గొన్నారు.